Cashews Health Benefits: డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఓ గొప్ప వరం. జీడిపప్పు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగానే తింటారు. వీటిల్లో జీడిపప్పు అత్యంత రుచికరమైనది. జీడిపప్పు ఎంత రుచిగా ఉంటుందో.. అంతే పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. జీడిపప్పు తింటే శరీరానికి అనేక ప్రయోజనాలున్నాయి. ప్రతిరోజూ జీడిపప్పు తినడం ద్వారా కాల్షియం, జింక్,మెగ్నీషియం లోపాన్ని తగ్గించవచ్చు. జీడిపప్పులో ఉండే ఫైబర్, ప్రొటీన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉంచుతాయి. జీడిపప్పులో ఐరన్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం కూడా ఉన్నాయి. కొంతమంది కాల్చిన జీడిపప్పులను చిరుతిండిగా తింటారు. భోజనం తర్వాత కూడా చాలామంది 2-4 జీడిపప్పులను తింటూనే ఉంటాడు. అయితే.. జీడిపప్పు ఎక్కువగా తినడం వలన ప్రయోజనాలకు బదులుగా హాని ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక రోజులో ఎన్ని జీడిపప్పులు తినాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Cashews Health Benefits: జీడిపప్పు అతిగా తింటే అనర్థమా..? రోజుకు ఎన్ని జీడిపప్పులు తినాలి
జీడిపప్పు తింటే చాలా రుచితోపాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రోజూ జీడిపప్పు తింటే ఎముకలు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. దీనిని పరిమిత పరిమాణంలో తినడం వల్ల మధుమేహం, బరువు నియంత్రణలో ఉంటాయి. రోజూకి 2 నుంచి 3 జీడిపప్పులు తింటే ఆరోగ్యానికి మంచిది.
Translate this News: