Cashews Health Benefits: జీడిపప్పు అతిగా తింటే అనర్థమా..? రోజుకు ఎన్ని జీడిపప్పులు తినాలి

జీడిపప్పు తింటే చాలా రుచితోపాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రోజూ జీడిపప్పు తింటే ఎముకలు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. దీనిని పరిమిత పరిమాణంలో తినడం వల్ల మధుమేహం, బరువు నియంత్రణలో ఉంటాయి. రోజూకి 2 నుంచి 3 జీడిపప్పులు తింటే ఆరోగ్యానికి మంచిది.

New Update
Cashews Health Benefits: జీడిపప్పు అతిగా తింటే అనర్థమా..? రోజుకు ఎన్ని జీడిపప్పులు తినాలి

Cashews Health Benefits: డ్రై ఫ్రూట్స్‌ మన ఆరోగ్యానికి ఓ గొప్ప వరం. జీడిపప్పు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగానే తింటారు. వీటిల్లో జీడిపప్పు అత్యంత రుచికరమైనది. జీడిపప్పు ఎంత రుచిగా ఉంటుందో.. అంతే పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. జీడిపప్పు తింటే శరీరానికి అనేక ప్రయోజనాలున్నాయి. ప్రతిరోజూ జీడిపప్పు తినడం ద్వారా కాల్షియం, జింక్,మెగ్నీషియం లోపాన్ని తగ్గించవచ్చు. జీడిపప్పులో ఉండే ఫైబర్, ప్రొటీన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉంచుతాయి. జీడిపప్పులో ఐరన్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం కూడా ఉన్నాయి. కొంతమంది కాల్చిన జీడిపప్పులను చిరుతిండిగా తింటారు. భోజనం తర్వాత కూడా చాలామంది 2-4 జీడిపప్పులను తింటూనే ఉంటాడు. అయితే.. జీడిపప్పు ఎక్కువగా తినడం వలన ప్రయోజనాలకు బదులుగా హాని ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక రోజులో ఎన్ని జీడిపప్పులు తినాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఒక రోజులో ఎన్ని జీడిపప్పులు తినాలి..?

జీడిపప్పును ఎక్కువగా రుచి కోసమే తింటారు. ఏది చాలా తప్పని నిపుణులంటున్నారు. రోజుకు కనీసం 3 నుంచి 4 వరకే తినాలి. అంతకంటే ఎక్కువ తింటే తింటే కడుపు నొప్పి వస్తుంది. అంతేకాదు.. జీడిపప్పు ఎక్కువగా తినడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కూడా ఉంటుంది.

జీడిపప్పు తింటే వలన కలిగే ప్రయోజనాలు

  • ప్రతీరోజూ జీడిపప్పు తినేవారి ఎముకలు దృఢంగా ఉంటాయి. జీడిపప్పులో ఎముకలకు మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు రోజూ 2 నుంచి 3 జీడిపప్పు తినిపిస్తే మంచిది.
  • జీడిపప్పును పరిమిత పరిమాణంలో తినాలి. అప్పుడే కడుపు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ ఉంటుంది. దీంతో గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • జీడిపప్పు చర్మానికి మేలు చేస్తోంది. రోజూ జీడిపప్పు తింటే చర్మం ముడతలు తగ్గుతాయి. జీడిపప్పులో విటమిన్-ఇ, యాంటీ-ఆక్సిడెంట్ అంశాలు చర్మం, జుట్టును బలోపేతం చేస్తుంది.
  • జీడిపప్పులో మంచి కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది జీవక్రియను పెంచడంలో ఉపయోగపడుతుంది. 3-4 జీడిపప్పు తింటే ఊబకాయం తగ్గుతుంది. అంతేకాదు ఇది ఆకలిని నియంత్రించడంలో ఉంచుతుంది.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు 2 నుంచి 3 జీడిపప్పులు తినవచ్చు. జీడిపప్పు తింటే గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటుంది. డయాబెటిక్ రోగులు తమ ఆహారంలో జీడిపప్పును తినాలి.

ఇది కూడా చదవండి: నిరంతర ఆలోచనలు మీ శరీరాన్ని ప్రభావితం చేస్తాయని తెలుసా? ఇలా చేసి చూడండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు