Eating More : ఎక్కువగా తింటున్నారా?.. అయితే డిప్రెషన్ ముప్పు తప్పదు తెలుసా?

అతిగా తినే అలవాటు ఉంటే అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, ఎక్కువ డిప్రెషన్‌ గురైయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారుకి ఫ్యూచర్‌లో ఉబ్బకాయం, జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

New Update
Eating More : ఎక్కువగా తింటున్నారా?.. అయితే డిప్రెషన్ ముప్పు తప్పదు తెలుసా?

Depression Problem : ప్రస్తుత కాలంలో ఏ పని చేసినా కొద్దిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టి చెయ్యాలి. లేకపోతే లేనిపోని సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మార్కెట్లో రకరకాల ఫుడ్డు లభిస్తుంది. ఈ ఫుడ్స్‌ని ఎక్కువగా తింటే(Eating More) అనారోగ్య సమస్యలు(Health Problems) వస్తాయని తాజా సర్వేలో వెళ్లడైంది. తరుచూ తినేవారిపై సర్వే చేయగా.. అతిగా తింటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అతిగా తినే అలవాటు వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. టైం దొరికితే ఏదో ఒక రకమైన ఆహారం తీసుకోవడం వల్ల మానసిక ఆందోళనకు గురి అవుతారని పరిశోధక నిపుణులు(Research Professionals) అంటున్నారు. ఈ అలవాటు ఉన్నవారు ఒత్తిడికి గురైయ్యే అవకాశం కూడా ఉంది. ఈ ఒత్తిడి ఎక్కువై డిప్రెషన్‌, మానసిక ఆందోళన గురైయ్యే వారు దానుంచి బయటపడటానికి ఎక్కువ ఆహారం తీసుకుంటున్నారట.

వెరైటీలే అని తింటే వ్యాధి వస్తుంది:

అయితే.. ఏదో ఒక వెరైటీ తింటే ఒత్తిడి తగ్గుతుందని ఆలోచించి తినడంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని సర్వే నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వయసులో ఉన్నవారులో ఆందోళన, ఆత్మగౌరవం, ఉద్రేకం, నిరాశ వంటివి అధికంగా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు ఇలాంటి వారు ఎక్కువగా డిప్రెషన్‌కు గురి అవుతారు. తరచూ ఏదో ఒకటి తింటూ ఉంటున్నారంటే అది ఏదో ఒక వ్యాధని అని అంటున్నారు. 2018 -20 సర్వే ప్రకారం.. ఈ ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 7.8 శాతానికి పెరిగినట్లు చెబుతున్నారు. తినే రుగ్మత ఉన్నవారు నిరాశ లక్షణాలతో పాటు నిరంతరం విచారణ, పనికిరాని అనుభూతి, ఆటలపై ఎక్కువ ఆసక్తి చూపలేరని అంటున్నారు.

కుటుంబ సభ్యులు శ్రద్ధ పెట్టాలి:

ఇలాంటి లక్షణాలు ఉంటే ఎలాంటి పనిపై ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం వంటివి వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. అంతే కాకుండా డిప్రెషన్‌(Depression) తో బాధపడుతున్న వారిలో మానసిక  క్షోభ వంటి సమస్యలకు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మానసిక ఆందోళన ఎదురుకోవడానికి తరచూ తినడంపై ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారని చెబుతున్నారు. అతిగా తిని ప్రమాదాలు తెచ్చుకుంటారు కాబట్టి ఇలాంటి వారిపై కుటుంబ సభ్యులపై ఎక్కువ శ్రద్ధ చూపాలని నిపుణులు అంటున్నారు. తరచూ తిని డిప్రెషన్‌కు గురైనవారితో సరదాగా మాట్లాడాలి, వారిలో ఎలాంటి టెన్షన్ లేకుండా రిలీఫ్‌గా ఉండేలా చూడాలంటున్నారు. లేకపోతే ఈ వ్యాధితో బాధపడేవారుకి ఫ్యూచర్‌లో ఉబ్బకాయం, జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఓం ను ఇలా జపిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు