Belly Fat: ఉదయాన్నే ఈ ఆహారాలు తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ పరార్ శరీర భాగాలు అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. బ్యాడీలో ఏ భాగం పెరిగినా.. తగ్గినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ పొట్ట, నడుము దగ్గర కొవ్వు చేరితే శరీరాకృతే మారిపోతుంది. బెల్లీ ఫ్యాట్ వచ్చిదంటే వ్యాయామ. వాకింగ్, యోగ, మంచి డైట్ వంటివి చేస్తే త్వరగా బరువు తగ్గుతారు. By Vijaya Nimma 03 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Belly Fat: మారుతున్న జీవన శైలి.. ఆహారపు అలవాట్ల వల్ల అనేకమంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం రకరకాల వ్యాయామాలు, రకరకాల ఆహారం తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం, పొట్టలో కొవ్వు కరిగించడం మరింత కష్టమైన టాస్క్. ఈ విషయంలో ఈరోజుల్లో అందరు ఎదుర్కొంటున్న సమస్య. అంతేకాదు అధిక బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గలేరు. కానీ.. బరువు తగ్గాలని అనుకుంటే చాలు త్వరగా బరువు తగ్గుతారు. చాలామంది బరువు తగ్గాలని ఫుడ్స్ తినడం మానేస్తే ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారని కొన్ని అధ్యాయనాలు అంటున్నారు. ఇది కూడా చదవండి: చలికాలంలో చర్మ సమస్యలకు ఈ జ్యూస్ చాలా బెస్ట్ చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే.. ఈ డైట్ అంటే సరైన సమయానికి.. సరైన మోతాదులో తీసుకోవడం. కానీ దీనిని ఎవరు సక్రమంగా ఫాలో చేయలేరు. సాధారణంగా అందరూ బరువు తగ్గాలని అల్పాహారాన్ని మానేస్తారు. కానీ ఇది చాలా తప్పని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరానికి అల్పాహారం చాలా అవసరం. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలంటున్నారు. అయితే.. బరువు తగ్గాలనుకునేవారు ఉదయం ఉదయం టిఫిన్‌లో తక్కువ క్యాలరీలు ఉన్న అల్పాహారం తింటే బరువు తగ్గుతారు. ఇలాంటి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. బరువు తగ్గాలంటే ఈ ఆహారాలు బెస్ట్ బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ మంచి ఫుడ్స్. ప్రస్తుతం ఈ ఓట్స్‌ని చాలామంది తింటున్నారు. వీటిల్లో కేలరీలు తక్కువ, పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి. దీనిని రోజూ తింటే బరువు సులుగా తగ్గుతారు. కప్పు ఓట్స్‌లో గోరువెచ్చని పాలు, కొంత తేనే , నల్ల ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, చెర్రీస్, యాపిల్స్ ముక్కలు వంటి పండ్లను కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే సాంబారుతో రెండు ఇడ్లీలు తింటే మంచిది. దక్షిణ భారతలో ఇడ్లీ సాంబార్ ప్రత్యేకత అల్పాహారం. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో 230 కేలరీలు ఉంటాయి. బరువును తగ్గుతారు ఒక గిన్నెలో రెండు కోడి గుడ్లు పగలగొట్టి, అందులో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలు వేసి ఆమ్లెట్ వేసుకోని తినండి. ఇవే కాదు సూప్‌లు, కాల్చిన బ్రౌన్ బ్రెడ్ తిన్నా బరువు సువలభంగా తగ్గుతారని నిపుణులు అంటున్నారు. మిక్సీలో రెండు యాపిల్స్, పాలు పోసి, కొంచెం తేనె, కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి మిక్సీ చేసుకోని తాగాలి. వీటితో పాటు 10-12 బాదం పప్పులను తింటే మంచి ఫలితం ఉంటుంది. కోడి గుడ్డులో 78 కేలరీలు ఉంటాయి. వీటిని ఉదయాన్నే తింటే ఎక్కువసేపు ఆకలిగా ఉండదు. అలాగే బరువు తగ్గేందుకు గ్రీన్ టీ బెస్ట్. దీనిలోఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మెటబాలిజంను పెంచి వేగంగా బరుగు తగ్గుతారు. అందుకే.. ఉదయం రెండూ సార్లు గ్రీన్ టీ తాగితే మంచిది. #health-benefits #belly-fat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి