Spicy Food: కారంగా తింటున్నారా.. కాస్త ఆగి ఇవి తెలుసుకోండి

స్పైసీ ఫుడ్ తినడం వల్ల చర్మంలోని తేమ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. వేడి మసాలాలు శరీరంలో అంతర్గత వేడిని పెంచుతాయి, పెరిగిన వేడి సహజంగా పైల్స్ వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.స్పైసీ ఫుడ్ తినడం వల్ల బీపీ, గుండె, అజీర్ణం సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు.

New Update
Spicy Food: కారంగా తింటున్నారా.. కాస్త ఆగి ఇవి తెలుసుకోండి

Spicy Food: భారతదేశంలో మిరపకాయలు తినే వారు చాలా మంది ఉన్నారు. తిండిలో కారం లేకపోతే కొందరికి ముద్ద కూడా దిగదు. కూరల్లో అయితే అడిగిమరీ కారం వేయించుకుంటారు. అన్నంతినేప్పుడు పక్కన కారప్పొడి ఉండాల్సిందే. అయితే ఎక్కువగా కారం తినడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మిరపకాయలు తినేవారికి తరచుగా పైల్స్ వస్తాయి. వేడి మసాలాలు శరీరంలో అంతర్గత వేడిని పెంచుతాయి, పెరిగిన వేడి సహజంగా పైల్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

పొడి చర్మం:

  • స్పైసీ ఫుడ్ తినడం వల్ల చర్మంలోని తేమ తగ్గుతుంది. అందుకే దూరంగా ఉంటే మంచిది.

బరువు పెరుగుతారు:

  • స్పైసీ ఫుడ్ తింటే ఆకలి వేస్తుంది. వేడి, కారంగా ఉండే ఆహారాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల తొందరగా ఆకలి వేస్తుంది. దీంతో బరువు కూడా పెరుగుతారు. అందుకే మసాలాలకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోపం తగ్గుతుంది:

  • కారం తక్కువగా తింటే కోపం తగ్గుతుందని అంటారు. దీని వెనుక కొన్ని వైద్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. మిర్చి ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ పెరుగుతుంది. మీరు రక్తపోటు సమస్యతో బాధపడుతుంటే మిరపకాయలకు దూరంగా ఉండండి. స్పైసీ ఫుడ్ తినడం వల్ల గుండె సమస్యలు కూడా వస్తాయి.
  • కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి. స్పైసీ ఫుడ్ తినడం వల్ల పొట్ట ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మసాలాలను తక్కువగా తింటేనే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే జామకాయ రసం తాగితే ఏమవుతుంది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: జిమ్‌లో చేరే ముందు ఈ టెస్ట్‌లు చేయించుకుంటే మంచిది

Advertisment
Advertisment
తాజా కథనాలు