Dry Coconut : కొబ్బరి అంటే అందరికి తెలిసిందే. చాలామంది పచ్చి కొబ్బరితో పాటు ఎండు కొబ్బరిని తింటారు. ఈ కొబ్బరితో ఎక్కువగా తీపి వంటకాలు చేస్తారు. అంతేకాకుండా.. కొబ్బరిని పొడిగా చేసి వంటలల్లో వేసుకుంటారు. ఎండుకొబ్బరితో వేసే వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే.. రోజూ ఎండు కొబ్బరిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. పచ్చికొబ్బరి, కొబ్బరి నీళ్ల వలె ఎండుకొబ్బరి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండుకొబ్బరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలున్నాయి. ఎండుకొబ్బరిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండు కొబ్బరి తింట వలన కలిగే లాభాలు
శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలంటే ఎండుకొబ్బరి ముక్కను ఖచ్చితంగా తినాలి. ఎండుకొబ్బరిలో మాంగనీస్, ఫైబర్, కాపర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిని తింటే ఇన్పెక్షన్ల, మెదడు ఆరోగ్యం, మెదడు చురుకుగా, రక్తహీనత, నరాల సమస్యలు దూరం అవుతాయి. ఎండుకొబ్బరిని బెల్లంతో కలిపి తింటే ఎక్కువ ఫలితాలతోపాటు, అనారోగ్య సమస్య తగ్గుతాయని వైద్య నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: కాకరకాయతో చర్మ సౌందర్యం..ఇలా వాడండి
ఎండుకొబ్బరిని ఒక డ్రై ఫ్రూట్ (Dry fruit) లాగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజూ ఎండుకొబ్బరిని తింటే ఎముకలు దృడంగా ఉంటాయి. మలబద్దకం కీళ్ల నొప్పులు, కడుపులో అల్సర్లు, ఎముకలు పెలుసు బారడం వంటి సమస్యలను దూరం అవుతాయి. అంతేకాకుండా.. ఎండుకొబ్బరి తింటే జీర్ణశక్తితోపాటు గుండె ఆరోగ్యం మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఎండుకొబ్బరి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచ్చుతుంది. ఈ విధంగా ఎండుకొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: జీలకర్ర నీళ్లు జీవ క్రియలకు మేలు..ఎన్నో ఔషధ గుణాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.