Sheermal Roti: షీర్మల్ రోటీ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రోటీ అని నిపుణులు అంటున్నారు. ఇది మన శరీరానికి ఎక్కువ మేలు చేసే అనేక పోషక మూలకాలు ఇందులో ఉన్నాయి. పర్షియాలో మూలాలను కలిగి ఉన్న షీర్మల్ రోటీ. మొఘల్ సామ్రాజ్యం సమయంలో భారత ఉపఖండానికి వచ్చింది. దీని పేరు 'షీర్' అంటే పాలు,'మాల్' అంటే సంపద. దాని గొప్పతనాన్ని, రాజ రుచిని ప్రతిబింబిస్తుంది. షీర్మల్ రోటీ నవాబీ, రాచరిక వంటశాలలకు గర్వకారణంగా మారింది. ఇక్కడ ప్రత్యేక సందర్భాలలో, విందులలో వడ్డిస్తారు.ఈ రోటీ గురించి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తుంది:
షీర్మల్ రోటీలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీనిని తింటే ఎంతో శక్తి వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో శరీరానికి ఎక్కువ శక్తి అవసరమైనప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. షీర్మల్ రోటీ రుచిలో సమృద్ధిగా ఉండటమే కాకుండా ఆకలిని ఎక్కువసేపు ఉంచుతుంది. దీన్ని తింటే ఎక్కువ సేపు పాటు సంతృప్తిగా ఉంటారు. తద్వారా అనవసరమైన ఆకలిని నివారించవచ్చు అని అంటున్నారు.
జీర్ణవ్యవస్థను సాఫీగా ఉంటుంది:
షీర్మల్ రోటీలో ఉపయోగించే పాలు, నెయ్యి తియ్యదనం దీనికి ప్రత్యేకమైన రుచి, వాసనను ఇస్తుంది. ఎక్కువగా తీపి వంటకాలను ఇష్టపడే వారికి ఇది ఒక వంటకం. షీర్మల్ లో ఉండే కొద్దిపాటి నెయ్యి జీర్ణక్రియకు సహాయపడుతుంది. నెయ్యి ఒక ఆరోగ్యకరమైన కొవ్వు, ఇది జీర్ణవ్యవస్థను సాఫీగా ఉంచుతుంది. ఈ యొక్క వంటకం దాని గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది. లక్నోలో షీర్మాల్‌కి కాబాబ్‌లు, టిక్కియా, నిహారీతో పెడుతారు.ఇరాన్‌లో ప్రాంతాలత బట్టి షీర్మల్ తయారు చేస్తారు. అంతేకాదు కొన్ని ప్రాంతాలల్లో ప్రయాణించేటప్పుడు స్మారక చిహ్నంగా తీసుకుంటారు.
ఇది కూడా చదవండి: అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం శంఖుపువ్వు టీ
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మీ పెట్ జుట్టు రాలిపోతోందా? ఇలా చేస్తే సరి