flowers: ప్రకృతి లభించే పూలుకి ఓ ప్రత్యేకత ఉంది. హిందూ సాంప్రదాయంలో ఏ పూజ చేసిన ముఖ్యంగా పూలు అవసరం. మనసుకు సంతోషంతోపాటు సరదానూ ఇవ్వటంలో పువ్వులు మొదటి స్థానం ఉంటాయి. కొందరూ స్త్రీలు తలలో పెట్టుకుంటారు. అయితే.. కొన్నిపూలను ప్రేమకు చిహ్నంగా చూస్తారు. నిజమైన పూలగుత్తులు చూడగానే ఆనంద అనుభూతి కలుగుతుంది. అయితే.. దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు పూజ చేస్తారు. పూజ పూలు లేకుండా పూర్తి కాదంటారరు అందుకే ఆ పూలకు అంత ప్రాధాన్యత ఉంది. పూలు పూజకే కాదు అందానికి, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో పరిశోధనలు చేసి ఆహార నిపుణులు కొన్ని విషయాలను తెలిపారు. ఈ పూలు అందంతోపాటు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో..? ఆ ఆ పూలేంటో..? ఇప్పుడు కొన్ని విషాయాలు తెలుసుకుందాం.
అరటి పువ్వు:
- అరటి పువ్వులో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల బరువు తొందరగా తగ్గుతారు. రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
బొప్పాయి పూలు:
- బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనివేరు నుంచి పూల వరకు అన్ని ఉపయోగపడతాయి. చాలా మంది డెంగ్యూ వచ్చినప్పుడు ఈ పూలతో టీ చేసుకొని తాగుతుంటారు. మధుమేహ ఉన్నవారికి కూడా ఇది మంచి మెడిసిన్‌లా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. దీనిని తరుచూ తీసుకోవడం వల్ల గుండె, లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
గులాబీ పూలు:
- మంచి సువాసన కలిగిన అందమైన పువ్వు గులాబీ. రోసా జాతికి చెందిన గులాబీని పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. 300పైగా దీని జాతులున్నాయి. గులాబీ పూలను ఎండబెట్టి టీ,స్వీట్స్‌లోనీ వేసుకోవడం వలన క్యాన్సర్ సమస్యలు దరి చేరవు.ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి.. అధిక బరువు తగ్గిస్తుంది. ప్రతీ రోజూ గులాబీ పూలను ఏదో రూపంలో తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆసియా దేశాల వంటలలో రోజ్ వాటర్‌నూ విరివిగా ఉపయోగిస్తారు.
ఇది కూడా చదవండి: ఈ జావతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..ప్రతీరోజూ తాగి చూడండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.