Romanesco Broccoli: రోమనెస్కో బ్రొకోలి గురించి ఎప్పుడైనా విన్నారా? రోమనెస్కో బ్రోకలీలో విటమిన్లు సి, కె ,కెరోటినాయిడ్స్, జియాక్సంతిన్, పీచు, బీటా కెరోటిన్‌లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ప్రతిరోజూ తింటే రోగనిరోధక శక్తి అధికం, చర్మం ఆరోగ్యం, ఎముకలకు పటుత్వంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Romanesco Broccoli: రోమనెస్కో బ్రోకలీ అంటే చాలామందికి తెలియదు. తెల్లటి క్యాలీఫ్లవర్, ఆకుపచ్చ బ్రోకలీ ప్రతిఒక్కరికి తెలిసి ఉంటుంది. కానీ ఈ రెండిటి కలయికలా ఉంటే రోమనెస్కో బ్రోకలీ గురించి ఎప్పుడైనా విన్నారా..? అంతేకాదు.. దీనిని కూర చేసిన తరువాత వచ్చే రుచి క్యాలీఫ్లవర్, ఆకుపచ్చ బ్రోకలీ రెండూ ఒకేలా ఉంటుంది. రోమనెస్కో బ్రోకలీ అనేక మొగ్గలు కలిగి ఉంటుంది. ఇది చూడటానికి ఇంకా పూర్తికాని మొగ్గలా ఉంటుంది. కానీ తినబోతే.. అలాంటి పసరుతనం లేకుండా కొద్దిగా తియ్యదనమూ దీని రుచి ఉంటుంది. రోగనిరోధక శక్తి అధికం: అంతేకాదు ఇందులో విటమిన్లు సి, కె ,కెరోటినాయిడ్స్, జియాక్సంతిన్, పీచు, బీటా కెరోటిన్‌లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ప్రతిరోజూ తీనటం వలన రోగనిరోధక శక్తి అధికంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంక చర్మం కూడా ఆరోగ్యంగా ఉండటంతోపాటు మించి మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎముకలకు పటుత్వం కూడా పెరుగుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. ఉడికించినవి తింటే ఎన్నో లాభాలు: సాధారణంగా పసుపు, ఆకుపచ్చ కలగలిసిన రంగులో రోమనెస్కో బ్రోకలీ ఉంటుంది. కొన్ని నారింజ, పసుపు, ఊదా రంగుల్లో కూడా ఉంటాయి. అయితే.. ఈ రోమనెస్కో బ్రోకలీని ముందు ఇటలీ దేశంలో ఎక్కువగా సాగుచేశారు. ప్రస్తుతం కెనడా, అమెరికా, ఇంగ్లండ్ దేశాల్లోనూ వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ పంట 75 నుంచి 100 రోజుల్లో పంట పడుతుంది. కాస్త తియ్యగా, కొంత వగరుగా ఉండే వీటిని కొందరు పచ్చిగానే తింటారు. మరికొందరైతే ఉడికించినవి తింటూ ఉంటారు. ఇలా రోమనెస్కో బ్రోకలీని తింటే ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి : బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడాను ఎలా గుర్తించాలి?.. ఎలా ఉపయోగపడతాయి? గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #best-health-tips #romanesco-broccoli మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి