Poha : పోహా తినడం వల్ల కలిగే లాభాలు పోహా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. పోహాలో విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. పోహా తింటే కడుపు నిండుగా ఉండి..వెంటనే ఆకలి వేయదు. ఇతర ఆహారం తినకుండా ఉంటారని వైద్యులంటున్నారు. By Vijaya Nimma 28 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Poha Benefits : చాలామంది అల్పాహారంగా పోహా(Poha) తినడానికి ఇష్టపడతారు. భారతదేశం(India) లోని అనేక ప్రదేశాలలో పోహాను ఎక్కువగా తింటుంటారు. పోహా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. అయితే పోహా తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోహాలో విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే బియ్యం కన్నా పోహా చాలా ఆరోగ్యకరమైనదని పోషకాహార నిపుణులు అంటున్నారు. పోహాలో నిమ్మరసం కలిపితే తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పోహా తినడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటారు. ఎన్నో ప్రయోజనాలున్నా పోహా తింటే ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫైబర్: పోహాలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థ(Digestive System) ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అన్నంతో పోలిస్తే పోహాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అటుకులపై ఉండే ఒక పొర చెక్కుచెదరకకుండా ఉంటుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆకలి వేయదు: పోహా తింటే కడుపు నిండుగా ఉంటుంది, వెంటనే ఆకలి వేయదు, కాబట్టి ఎక్కువగా ఇతర ఆహారం తినకుండా ఉంటాం. అటుకులు తినడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎనీమియా వంటి రోగాల బారిన పడకుండా చేస్తుంది. పోహా తింటే కొవ్వు పెరగదు: క్రమం తప్పకుండా అల్పాహారంగా పోహా తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అతిగా తినే అలవాటు నుండి బయటపడవచ్చు. అందువల్ల శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోదు. Also Read : ఉప్పు మాత్రమే కాదు చక్కెర ఎక్కువ తీసుకుంటే గుండెపోటు వస్తుందా..? అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు: పోహాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు(Sugar Levels) పెరగడానికి, బరువు పెరగడానికి(Weight Gain) కారణం అవుతుంది. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారు అటుకులతో చేసిన ఆహారాన్ని అధికంగా తినవద్దు. బరువు తగ్గాలనుకుంటున్న వారికి కూడా పోహా మంచి ఎంపికని వైద్యులు చెబుతున్నారు. పరిమితంగా తినాలి: నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజూ పరిమిత మోతాదులో పోహా తింటే బరువు పెరగరని చెబుతున్నారు. కానీ ఎక్కువగా పోహా తినడం వల్ల ఊబకాయం వస్తుందని హెచ్చరిస్తున్నారు వివిధ కూరగాయలు, మసాలా దినుసులను జత చేసి వండితే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. పోషక విలువలు ఎక్కువగానే అందుతాయి. దీన్ని అల్పాహారంగా వండుకుంటే తక్కువ టైంలోనే బ్రేక్ ఫాస్ట్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి: ఉప్పు మాత్రమే కాదు చక్కెర ఎక్కువ తీసుకుంటే గుండెపోటు వస్తుందా..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #poha-benefits #digestive-system మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి