Orange Fruit: తొక్కే కదా అని తీసిపారేయకండి..లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

నారింజ పండు తొక్క తినడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఆరెంజ్ పీల్స్‌లో హెస్పెరిడిన్ అనే ఫ్లేవనాయిడ్ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. నారింజ తొక్కను తింటే చర్మ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ.

Orange Fruit: తొక్కే కదా అని తీసిపారేయకండి..లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
New Update

Orange Fruit: నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని మనకు తెలుసు. అయితే పండులో లాగానే దాని తొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. నారింజ పండు తొక్క తినడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య మార్పులు వస్తాయి. ఆరెంజ్ తొక్కను పారేయకుండా అనేక రకాలుగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు. ఆరెంజ్‌పై తొక్క కొంచెం చేదుగా ఉంటుంది. దీన్ని సరిగ్గా ప్రాసెస్ చేసి పిల్లలకు మిఠాయిగా లేదా తేనెలో నానబెట్టి ఇవ్వవచ్చు. దాని ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు దీన్ని రోజూ తినడం ప్రారంభిస్తారు. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ చర్మ ఆరోగ్యాన్ని, మధుమేహాన్ని, రక్తపోటును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

గుండె ఆరోగ్యం:

  • ఆరెంజ్ పీల్స్‌లో హెస్పెరిడిన్ అనే ఫ్లేవనాయిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నారింజ తొక్కలలో ఉండే పాలీ మెథాక్సిలేటెడ్ ఫ్లేవోన్స్ ఔషధాల కంటే చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గించడంలో సహాయపడతాయి.

అలర్జీలను నివారిస్తుంది:

  • హిస్టామిన్లు మంటతో పోరాడే రసాయనాలు.ఈ హిస్టామిన్ నారింజ తొక్కలో పుష్కలంగా ఉంటుంది. సహజంగా నారింజ తొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది చర్మం నుంచి అంతర్గత అవయవాలలో మంటను నయం చేస్తుంది.

క్యాన్సర్‌ను తగ్గిస్తుంది:

  • నారింజ తొక్కలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లకు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించే శక్తి ఉంది. నారింజను క్రమం తప్పకుండా తినే వారి కంటే నారింజ తొక్కను తింటే చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది.

బరువు కోల్పోతారు:

  • ఆరెంజ్ పండు తొక్కను తినడం వల్ల శరీరంలోని మెటబాలిజం పెరిగి శరీరంలో కొవ్వు వేగంగా కరిగిపోతుంది. నారింజ తొక్కలో ఉండే అణువులు కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడతాయి. ఇవి ఊబకాయం తగ్గించే మందులలో కూడా ఉంటాయి.

జీర్ణశక్తి మెరుగవుతుంది:

  • ఆరెంజ్ తొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర ఆహార పదార్థాల వల్ల కలిగే అజీర్ణం, అపెండిసైటిస్, గుండెల్లో మంట, అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందని, అంతేకాకుండా మలబద్ధకం కూడా ఉండదని నిపుణులు అంటున్నారు.

హ్యాంగోవర్:

  • హ్యాంగోవర్‌ ఉన్నవారు సాధారణంగా నిమ్మరసం, మజ్జిగ వంటివి తాగితే కొంత ఉపశమనం లభిస్తుంది. నారింజ పండ్ల తొక్కను శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి టీలాగా తాగితే హ్యాంగోవర్‌ తక్షణమే పోతుంది.

ఇది కూడా చదవండి: గ్యాస్ట్రిక్ పెరిగితే బీపీ పెరుగుతుందా?..లక్షణాలు ఏంటి?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#orange-fruit #health-benefits
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి