Mint Leaves: ప్రతిరోజూ పుదీనాతో చేసిన వంటకాలు తింటున్నారా? ఈ ఆర్టికల్ మీకోసమే!

పుదీనా ఆకులను ఉపయోగించినప్పుడు..ఎంత పరిమాణంలో ఉపయోగిస్తున్నారనే దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏదైనా అతిగా తినడం హానికరమని హెచ్చరిస్తున్నారు. పుదీనా సువాసన బలంగా, మెదడును కూడా ఉత్తేజితం చేస్తుంది. ఇది ఏకాగ్రతతో, సానుకూలంగా ఉంచుతుంది.

New Update
Mint Leaves: ప్రతిరోజూ పుదీనాతో చేసిన వంటకాలు తింటున్నారా? ఈ ఆర్టికల్ మీకోసమే!

Mint Leaves: పుదీనా ఆకులకు ప్రత్యేకమైన రుచి ఉంది. వాటి తాజా సువాసన, శీతలీకరణ ప్రభావం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఏ వంటగదిలోనైనా, అది దేశంలో, విదేశాలలో..ఇది సాధారణ ఆహార పదార్థం. అయితే.. దీన్ని మనం రోజూ ఆహారంలో చేర్చుకోవచ్చా? అనుడౌట్‌ కొందరిలో ఉంటుంది. పుదీనా ఆకులను ఉపయోగించినప్పుడు..ఎంత పరిమాణంలో ఉపయోగిస్తున్నారనే దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏదైనా అతిగా తినడం హానికరమని హెచ్చరిస్తున్నారు. దీనిని టీపై చల్లుకోవచ్చు, ఆహారంలో ఉపయోగించవచ్చు వైద్యులు అంటున్నారు. పుదీనా ఆకులను ఎక్కువగా వాడితే హానికరం. రోజువారీ ఆహారంలో పుదీనాను ఉపయోగించడం ప్రయోజనకరమా లేదా హానికరమా అని విషయంపై డైట్ స్పెషలిస్టులు కొన్ని విషయాలు చెబుతున్నారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా ఆకుల ప్రయోజనాలు:

  • పుదీనా సువాసన ఎంత బలంగా ఉంటుందంటే అది మెదడును కూడా ఉత్తేజితం చేస్తుంది. అంతేకాదు ఇది ఏకాగ్రతతో, సానుకూలంగా ఉంచుతుందని నిపుణులు అంటున్నారు.
  • దగ్గు అదేపనిగా వస్తుంటే పుదీనా ఆకుల రసంతో బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో నొప్పిగా ఉన్నా పుదీనా ఆకుల రసంలో తేనె కలిపి తాగితే మంచి ఫలితం వస్తుంది.
  • నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు దీనిని చూయింగ్ గమ్‌గా ఉపయోగించవచ్చు. ఇది సహజమైన మార్గంలో శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
  • పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
  • ముఖం కాంతివంతంగా మారాలంటే పుదీనా ఆకుల్ని మిక్సీలో వేసి గుజ్జులా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి గంట తర్వాత నీటితే కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం రంగు మారుతుంది.
  • పుదీనా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, కడుపు సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించడంతో పాటు, అజీర్తి సమస్యను కూడా తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: మీ పెట్ జుట్టు రాలిపోతోందా? ఇలా చేస్తే సరి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు