Winter Sweet: చలికాలంలో ఈ స్వీట్‌ను టేస్ట్ చేయాల్సిందే.. బెల్లం, ఖర్జూరంతో రసమలైని ఇలా తయారు చేసి చూడండి!

చలికాలంలో తినే అత్యంత రుచికరమైన, ఆరోగ్యకరమైన తీపి వంటకంలో రసమలై ఒకటి. చలికాలంలో శరీరానికి శక్తి అందడంతో పాటు చలి నుంచి ఉపశమం పొందాలంటే బెల్లం, ఖర్జూరంతో చేసిన రస్మలై తయారు చేసుకోవాలి. రసమలై తయారీ గురించి తెలుసుకోవాలంటే మొత్తం ఆర్టికల్‌ చదవండి.

New Update
Winter Sweet: చలికాలంలో ఈ స్వీట్‌ను టేస్ట్ చేయాల్సిందే.. బెల్లం, ఖర్జూరంతో రసమలైని ఇలా తయారు చేసి చూడండి!

Winter Sweet: పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రసమలై రుచిని ఇష్టపడతారు. రస్మలై ఏడాది పొడవునా సులభంగా లభించే తీపి, రుచి వంటకం. వీటిని ఆరోగ్యంగా తినాలంటే ఇంట్లోనే బెల్లం, ఖర్జూరాలతో రసమలైని తయారు చేసుకోవచ్చు. రసమలై ఎంత రుచిగా ఉంటుందో..ఇందులో ఎక్కువ కేలరీలు కూడా ఉంటాయి. ఊబకాయం పెరుగుతుందనే కారణంతో కొందరు రసమలై తినకుండా ఉంటారు. అలాంటి వారికి బెల్లం, ఖర్జూరంతో చేసిన రసమలై ఉత్తమం. దీన్ని తినడం వల్ల చలికాలంలో వెచ్చగా ఉంటారు. బెల్లం, ఖర్జూరంతో చేసిన రసమలై తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని తినవచ్చు. ఇప్పుడు బెల్లం-ఖర్జూరంతో రసమలై ఎలా తయారు చేయాలి తెలుసుకుందాం.

రసమలై తయారీకి కావలసిన పదార్థాలు

  • రసమలైలో పాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని కోసం దాదాపు 3 లీటర్ల పాలు అవసరం ఉంటుంది. పాల నుంచి చేన్నా చేయడానికి, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 4 కప్పుల బెల్లం, 2 టేబుల్ స్పూన్ల మిశ్రమ డ్రై ఫ్రూట్స్, 1/4 యాలకుల పొడి, 5-6 కుంకుమపువ్వు, 2 టేబుల్ స్పూన్ల తురిమిన ఖర్జూరాన్ని రడీగా పెట్టుకోవాలి.

రసమలై తయారీ

  • రసమలై సిద్ధం చేయడానికి.. పాన్‌లో రెండు లీటర్ల పాలను మరిగించాలి. పాలు మరిగిన తరువాత గ్యాస్ ఆఫ్ చేయాలి. పాలును కొద్దిగా చల్లర్చి దానిలో నిమ్మరసం కలపాలి. పాలలో నిమ్మరసం కలిపిన వెంటనే పాలు పూర్తిగా విరుగుతాయి. ఇప్పుడు చెన్నాను తొలగించడానికి గుడ్డ ద్వారా పాలను వడకట్టి ఆ వస్త్రాన్ని ఏదో ఒక చోట వేలాడదీయడం, గట్టిగా నొక్కలి. నీటిని పూర్తిగా పోయిన తరువాత చెన్నాని బాగా మెత్తనిపెస్ట్‌లా చేసుకోవాలి. తరువాత చెన్నాను బంతులుగా, కొద్దిగా విస్తరించి మంచి ఆకారంలో రస్మలైని సిద్ధం చేయాలి. సిరప్ చేయడానికి, పాన్‌లో బెల్లం, రెండు కప్పుల నీరు పోసుకోవాలి. సిరప్ మరిగేటప్పుడు అందులో సిద్ధం చేసుకున్న చెన్నా ముక్కలను వేసి 15 నిమిషాలు ఉడకబెట్టాలి. మిగిలిన 1 లీటరు పాలను సగానికి వచ్చే వరకు మరిగించి..అందులో మిగిలిన బెల్లం, తురిమిన ఖర్జూరాన్ని కలిసి కాసేపు ఉడికిన తర్వాత పాలలో కుంకుమపువ్వు, యాలకులు వేయాలి. ఇప్పుడు సిరప్ నుంచి చెన్నాను తీసి పాలలో కలుపుకోవాలి.బెల్లం, ఖర్జూరంతో చేసిన రుచికరమైన రస్మలై సిద్ధం అవుతుంది. దానిని నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి సర్వ్ చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు కనిపిస్తే అది థైరాయిడ్ కావొచ్చు.. చెక్‌ చేసుకోండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు