Attipa Plant: అందుకే ఆ మొక్క పేరు సిగ్గాకు.. దీని ఆకులు తింటే ఆ కోరికలు ఆగనే ఆగవట!

అత్తిపత్తి మొక్క ఆకులు, వేర్లను తినటం వలన శారీరక నొప్పులు, అలసట, శరీరంలో వేడి, నిద్రలేమి సమస్యలు తగ్గటంతోపాటు మూత్ర పిండాలు శుభ్రం అవుతాయి. ఈ మొక్క వేర్లను నీటిలో ఉడికించి ఆ నాటిని తాగితే కిడ్నీ సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

New Update
Attipa Plant: అందుకే ఆ మొక్క పేరు సిగ్గాకు.. దీని ఆకులు తింటే ఆ కోరికలు ఆగనే ఆగవట!

Attipa Plant:  అటవీ ప్రాంతాల్లో, గ్రామాలలో కనిపించే కొన్ని మొక్కలు చూస్తే వింతగానో, ఆశ్చర్యంగాను అనిపిస్తుంది. పూర్వకాలంలో ఆయుర్వేదిక నిపుణులు మొక్కలను ఎక్కువగా ఉపయోగించేవారు. కొన్ని మొక్కలు టచ్ చేస్తే మూసుకుపోయే ఆకులు కూడా ఉంటాయి. ఇప్పటి కాలం పిల్లలకి వీటి గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కొంతమంది పిల్లలు ఈ ఆకులతో ఆటలు కూడా ఆడుకునేవారు. అత్తిపత్తి మొక్క ఆకును సిగ్గాకు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ మొక్కకు మనుషులు ముట్టుకున్న, కొంచెం గాలి వీచిన ఈ ఆకలి వెంటనే మూసుకుపోతాయి. ఈ మొక్కతో, ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు,

అలసట, కిడ్నీ సమస్యలు దూరం:

  • అత్తిపత్తి మొక్క ఆకులు ఆయుర్వేదిక మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తారట. ఈ మొక్కను ఇంటి పరిసరాల్లో పెంచుకుంటే నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుందని, దాని గాలి తగిలితే మానసిక వికాసం కలుగుతుందని నమ్ముతుంటారు. పురాతన కాలంలో రుషులు దీనిని ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగించారని చెబుతారు.  దీనిని తినటం వలన శారీరక నొప్పులు, అలసట,శరీరంలో వేడి,  నిద్రలేమి సమస్యలు  తగ్గటంతోపాటు మూత్ర పిండాలు శుభ్రం అయ్యి..కిడ్నీ సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

సంతానం కలుగుతుంది:

  • ఈ మధ్యకాలంలో ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. అత్తిపత్తి ఆకులు, వేర్లు ఎండబెట్టి పొడిగా చేసి దానిని అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఈ పొడిని ఉదయం సాయంత్రం రెండు పూటలా చిటికెడు తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తం చక్కెరస్థాయిలు తగ్గటంతో పాటు శరీరంలో వాపులు, గాయాలు మానడం, హానికర గడ్డలు, మొటిమలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా గాయాలైనప్పుడు సిగ్గాకు మొక్క రసాన్ని రాస్తే మానిపోతాయని అంటున్నారు. ఈ మొక్క వేర్లు, ఆకులు దంపతుల్లో శారీరక, మానసిక రుగ్మతలను తగ్గించడంతోపాటు మానసిక వికాసానికి దోహదపడి.. లైంగికపరమైన కోరికలను పెంచుతుందని అంటున్నారు. కొన్ని ప్రాంతాలలో కొత్తగా పెళ్లయిన జంటకు ఈ ఆకుల్ని తినిపిస్తారట. దీనివలన కోరికలు రెట్టింపు పెరిగి.. సంతానం కలుగుతుందని అక్కడ ప్రాంతాలవారు నమ్ముతారు.

ఇది కూడా చదవండి : పెళ్లికి సిద్ధమవుతున్నారా?.. వారం రోజుల ముందు ఇవి అస్సలు తినకండి

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు