Brahmi leaves: ఉదయాన్నే ఇది తింటే జ్ఞాపకశక్తి రెట్టింపు ఖాయం బ్రహ్మి ఆకులను ఉదయం ఖాళీ కడుపుతో తింటే మెదడుకు సంబంధిత రుగ్మతలను తొలగించే శక్తి దీనికి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది మెదడుకు రక్త ప్రసరణను పెంచి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఈ బ్రహ్మీ ఆకులను నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. By Vijaya Nimma 31 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Brahmi leaves: శతాబ్దాలుగా అనేక ఔషధ మొక్కలు ఆయుర్వేదంలో ఉపయోగించబడుతున్నాయి. అందులో బ్రహ్మి ఒకటి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన బ్రహ్మి మన మెదడు పనితీరును ఎంతో మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఎన్నో వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. బ్రహ్మి ఆకులను కడిగి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. దీనిని టీ, డికాక్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. బ్రహ్మీ ఆకులు అందుబాటులో లేకుంటే దాని పొడిని కూడా వాడుకోవచ్చు. బ్రహ్మి ఆకులు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మెదడులోని నరాలకు మంచిది: ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీని ఆకులను నమలడం వల్ల మెదడులోని నరాలు బలపడతాయి. రోజంతా ఉండే నీరసం, అలసట తగ్గుతాయి. బ్రహ్మి ఆకులు ఒత్తిడి, డిప్రెషన్, మతిమరుపు, మానసిక రుగ్మతలు, మూర్ఛను తగ్గిస్తాయి. పరిశోధన ప్రకారం.. 97 శాతం మెదడుకు సంబంధిత రుగ్మతలను తొలగించే శక్తి దీనికి ఉందని తేలింది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీని ఆకులను నమలడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. స్ట్రోక్ ప్రమాదాలు ఫసక్: మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్లాసు పాలలో 2 చెంచాల బ్రహ్మీ పొడిని మరిగించి పడుకునే ముందు తాగితే నిద్రలేమి సమస్యను నయం చేస్తుంది. మంచిగా నిద్రపడుతుంది. అంతేకాకుండా బ్రహ్మీ ఆకులను నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు సమస్య తగ్గుతుంది. ప్రతి రోజూ ఉదయం బ్రహ్మీ ఆకులను నమలడం వల్ల ఆస్తమా సమస్య తగ్గుతుంది. గొంతులో కఫం, శ్లేష్మం కరిగిపోతాయని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో వేధించే మార్నింగ్ సిక్నెస్ వల్ల ప్రయోజనాలున్నాయా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #10-tips-for-better-health #brahmi-leaves మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి