Sugar Control: ఈ కూరగాయను తింటే శరీరంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి!

టైప్-2 డయాబెటిస్ ఉన్నవాళ్లు బీన్స్‌ని తీసుకుంటే షుగర్ లెవల్స్‌ తగ్గుతాయి. షుగర్‌ను కంట్రోల్ చేయడంలో బీన్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. బీన్స్‌లో ఉండే ఫైబర్‌ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంతో పాటు.. అధిక బరువు, జీర్ణ, క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

New Update
Sugar Control: ఈ కూరగాయను తింటే శరీరంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి!

Sugar Control: షుగర్ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. అయితే ఈ సమస్య పెరిగినప్పుడు ఆహారాన్ని చాలా కంట్రోల్ చేయాలి. అంతేకాక కొన్ని తీసుకునే ఆహారాలు, తీసుకోకూడని ఆహారాలు కూడా ఉంటాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవాళ్లు బీన్స్‌ని తీసుకుంటే షుగర్ లెవల్స్‌ తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. షుగర్‌ని కంట్రోల్ చేయడంలో బీన్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే సమస్యను తగ్గించుకోవచ్చు. వీటిల్లో ఉండే ఫైబర్‌ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. అధిక బరువు ఉన్నవాళ్లు బీన్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 Eating beans vegetable keeps sugar levels in body under control
బీన్స్‌లో జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్స్, పోటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నిర్దిష్టంగా ఉంచి శరీర పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ప్రోటీన్స్‌లు ఇస్తుంది. బీన్స్ ప్రోటీన్‌కు మూలాధారం కావడం వలన శాఖహారులకు ఇది మంచి ఆహారం. దీంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబర్ కలిగి ఉంటుంది. బీన్స్‌ని తీసుకుంటే క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు ఆరోగ్యంగా  ఉంటారు. అందుకే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో బీన్స్ ఉంటే అధిక బరువు తగ్గించుకోవడంతో పాటు అనేక ఇతర వ్యాధులు, షుగర్ నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నూనె లేకుండా బెండకాయ వేపుడు.. ఎలా చేయాలంటే

Advertisment
తాజా కథనాలు