Health Tips: ఈ 6 ఫుడ్స్ తింటే కళ్ళ కింద నల్లటి మచ్చలు మాయం.. లిస్ట్ ఇదే!

కళ్ల కింద నల్లటి వలయాలను వదిలించుకునేందుకు మార్కెట్లో లభించే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. సరైన పోషకాహారం లేనిది ఈ సమస్యను అధిగమించడం కష్టం. టమాటాలు, బొప్పాయి,దోసకాయ,బీట్ రూట్ వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

Health Tips: ఈ 6 ఫుడ్స్ తింటే కళ్ళ కింద నల్లటి మచ్చలు మాయం.. లిస్ట్ ఇదే!
New Update

Dark Spots Reducing Tips: కళ్ల కింద నల్లటి వలయాలు ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, వాటిని తొలగించడానికి రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, డార్క్ సర్కిల్స్ (Dark Spots) సమస్య ఇద్దరినీ ఇబ్బంది పెడుతుంది. వాటి నుంచి విముక్తి పొందాలంటే కెమికల్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడకుండా.. ఒకసారి హోం రెమెడీస్ ట్రై చేయండి. వారి సహాయంతో కొన్ని నెలల్లో నల్లటి వలయాలను వదిలించుకోవచ్చు.

సాధారణంగా నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి వయస్సు మీదపడటం, అలర్జీలు, డీ హైడ్రేషన్, జెనెటిక్స్ కారణాలను కూడా ఉన్నాయి. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, ఆల్కహాల్, సిగరెట్, గాలి కాలుష్యం వంటివి కూడా ఈ సమస్యకు కారణమని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.

టమాటాలు:

టమాటాలు (Tomatoes) రక్తప్రసరణను మెగుపరుస్తుంది. కళ్ల కింద ఉన్న చర్మాన్ని కాపాడుతాయి. వీటిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ లైకోపీన్ ఉంటుంది. కళ్ల కింద చర్మం పల్చబడటం లేదా ఆ ప్రాంతంలో రక్తప్రసరణ పెరగడంతో రక్తనాళాలు ఉబ్బి కొన్నిసార్లు కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. లైకోనిన్ ఈ రక్త నాళాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్తనాళాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ డార్క్ సర్కిల్స్ రూపాన్ని తగ్గిస్తుంది.

బొప్పాయి:

బొప్పాయిలో (Papaya) విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిండంతో పాటు పాత చర్మ కణాలను కొత్తవాటితో భర్తీ చేయడంలో విటమిన్ ఎ కీలకంగా ఉంటుంది. ఈ ప్రయోజనాలతో కాలక్రమేణా కళ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టి అందమైన ముఖాన్ని అందిస్తుంది. బొప్పాయిలో నేచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్, యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తాయి.

దోసకాయ:

దోసకాయలు చర్మాన్ని రీ హైడ్రేట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొల్లాజెన్ నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి. రక్తనాళాల ఆరోగ్యానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లు కె, ఏ, ఈ, సీ లను అందిస్తుంది.

బీట్ రూట్:

బీట్ రూట్ లో పుష్కలంగా లభించే బీటాలైన్ అనే యాంటీ అక్సిడెంట్ కళ్ల కిందన నల్లటి వలయాలను తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంతోపాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బీట్ రూట్ క్రమం తప్పకుండా తింటే డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గుతాయి. దీంట్లో విటమిన్ సి మెగ్నీషియం, పొటాషియం, చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి.

గ్రీన్ వెజిటేబుల్స్ :

పాలకూర, బ్రకోలీ వంటి ఆకుకూరలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ కె కళ్ల కింద ఉబ్బును తగ్గిస్తాయి.

వాటర్ మిలన్ :

పుచ్చకాయలో (Watermelon) పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు బి1, బి6, సి వంటి పోషకాలు నల్లని వలయాలను తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. క్యారెట్లు, చిలగడదుంపల్లోని బీటా కెరోటిన్ శరీరాన్ని హైడ్రేట్ చేసి కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

ఇది కూడా చదవండి:  ఇండియా కూటమికి పరాభవం.. తెలంగాణ మినహా అంతటా నిరాశే!

#health-tips #dark-circles #dark-spots
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe