ఢిల్లీ ఎన్‎సిఆర్‎లో భూకంపం..భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన జనం..!!

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 9.34 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూకుష్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 15 సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

New Update
Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో (Earthquake in Delhi NCR) బలమైన భూకంపం సంభవించింది. జమ్మూ కాశ్మీర్‌, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో కూడా భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 9.34 గంటలకు భూకంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూకుష్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 15 సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

ఢిల్లీ NCR సహా పరిసర ప్రాంతాలలోనూ బలమైన ప్రకంపనలు సంభవించాయి. బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఘజియాబాద్ సహా సమీప నగరాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీనితో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌లలో కూడా భూమి కంపించింది.

జూన్ 13న కూడా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం వచ్చింది. పంజాబ్, జమ్మూ-కశ్మీర్, హర్యానా మొదలైన ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంప కేంద్రం జమ్మూ కాశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు