Earthquake : జమ్మూ కశ్మీర్ లో భారీ భూకంపం..రిక్టర్‌ స్కేలు పై 5.5 తీవ్రత నమోదు!

జమ్మూ కశ్మీర్లోని ఉత్తర ప్రాంతంలో సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రిక్టర్‌ స్కేల్‌ పై 5.5గా నమోదు అయ్యింది.

New Update
Earthquake : జమ్మూ కశ్మీర్ లో భారీ భూకంపం..రిక్టర్‌ స్కేలు పై 5.5 తీవ్రత నమోదు!

Earthquake In Jammu & Kashmir : జమ్మూ కశ్మీర్(Jammu & Kashmir) లోని ఉత్తర ప్రాంతంలో సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రిక్టర్‌ స్కేల్‌(Richter Scale) పై 5.5గా నమోదు అయ్యింది. ఈ భూకంపం భూమి లోపల 10 కి. మీల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు వివరించారు.

అంతే కాకుండా శ్రీనగర్‌(Srinagar) లో కూడా చిన్నపాటి భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం కూడా జమ్మూ కశ్మీర్‌ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి భూకంపం సంభవించింది. శ్రీనగర్‌, గుల్‌మార్గ్‌ ప్రాంతాలలో 3.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీనికి సంబంధించిన విషయాలను అధికారులు వివరించారు. ఆ సమయంలో భూకంపం భూమి లోపల 5 కి. మీ ల వద్ద స్థిరపడినట్లు సిస్మాలజీ విభాగం, జాతీయ భూకంప కేంద్ర అధికారులు వివరించారు.

Also Read : అధిక కొలెస్ట్రాల్‌ తో బాధపడుతున్నారా.. అయితే ఉడకబెట్టిన ఈ 3 పదార్థాలను తినండి!

Advertisment
తాజా కథనాలు