Jammu Kashmir: వరుస భూకంపాలతో వణికిపోతున్న జమ్మూ..24 గంటల్లో అతలాకుతలం

జమ్మూకాశ్మీర్‌ ప్రజలు వరుస భూకంపాలతో వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో ఆరు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత 3.2 నుంచి 2.6 మధ్య నమోదైంది. ఈ సమయంలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

New Update
Jammu Kashmir: వరుస భూకంపాలతో వణికిపోతున్న జమ్మూ..24 గంటల్లో అతలాకుతలం

Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ ప్రజలు వరుస భూకంపాలతో వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో ఆరు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత 3.2 నుంచి 2.6 మధ్య నమోదైంది. ఈ సమయంలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కిష్త్వార్ దోడా జమ్మూ కాశ్మీర్‌లో రోజులో ఐదుసార్లు భూకంపం వచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్, దోడా జిల్లాల్లో రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత 3.2 నుంచి 2.6 మధ్య నమోదైందని అధికారులు తెలుపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కిష్త్వార్‌లో ఐదు భూకంపాలు, దోడాలో ఒక భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేధిక ఇచ్చింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయానికి ఆరు ప్రకంపనలు సంభవించాయి.

ఇది కూడా చదవండి: కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Advertisment
తాజా కథనాలు