ఆ ప్రాంతంలో పోహా, జిలేబీ ఉచితం.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు చోట్ల రాజకీయ నాయకులు ప్రచారాలు కూడా మొదలుపెట్టేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న ఈ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఆయా రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తాయి. ఓట్ల కోసం ఆకర్షించే తాయులాలు ప్రకటిస్తాయి.

ఆ ప్రాంతంలో పోహా, జిలేబీ ఉచితం.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
New Update

మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు చోట్ల రాజకీయ నాయకులు ప్రచారాలు కూడా మొదలుపెట్టేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న ఈ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఆయా రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తాయి. ఓట్ల కోసం ఆకర్షించే తాయులాలు ప్రకటిస్తాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఓ దుకాణదారుల అసోసియేషన్ మాత్రం ఉచితం అంటూ ముందుకొచ్చేసింది. మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా ఓటు వేసేటటువంటి అభ్యర్థులకు ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని ప్రకటన చేసింది. అయితే ఎందుకు ఇలా ఆ దుకాణదారుల అసోసియేష్ ఫ్రీ ఫ్రీ అంటూ ముందుకు వచ్చింది అనే కదా మీ సందేహం. అయితే దీని వెనకాల కూడా ఓ కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్లినట్లైతే ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది.

మధ్యప్రదేశ్‌లో ఉన్న 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ-కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ ఉండబోతోంది. ఈ తరుణంలోనే ఇందౌర్‌లో ఫుడ్ హబ్ అయినటువంటి '56 దుకాణ్' యజమానులు వినూత్న ఆఫర్‌ను ప్రకటించారు. ఎవరైతే ముందుగా ఓఠటు వేసి తమ వేలికి ఉన్న ఇంకును చూపిస్తారో వాళ్లకి ఉచితంగానే పోహా, జిలేబీ అందిస్తామని తెలిపారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆఫర్ ఉధయం 9 గంటలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికల వేళ.. ఓటింగ్ శాతం పెంచడానికే ఈ ఉచిత ఆఫర్‌ను ప్రకటించామని '56 దుకాణ్ ట్రేడర్స్' అసోసియేషన్ అధ్యక్షుడు గుంజన్ శర్మ పేర్కొన్నారు. అలాగే పరిశుభ్రత విషయంలో దేశంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఇందౌర్‌ను ఓటింగ్ శాంతంలో కూడా అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. పోలింగ్ రోజున నిర్దేశిత సమయం దాటిన తర్వాత ఓటు వేసి వచ్చిన వారికీ 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు. ఇందౌర్ అర్భన్‌ పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2018లో అక్కడ 14.72 లక్షల ఓటర్లలో 67 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈసారి దాదాపు15.55 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు.

#assembly-election-2023 #madhya-pradesh-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe