Ear Tips: చెవిలో గులిమి 2 నిమిషాల్లో బయటికి వచ్చే చిట్కాలు ఈ రోజుల్లో చాలా మంది చెవులను ఇయర్ బడ్స్ సాయంతో క్లీన్ చేస్తుంటారు. దూదితో చేసినా సరే ఇయర్‌బడ్స్ వాడటం హానికరమని నిపుణులు అంటున్నారు. గులిమి తీసేందుకు బడ్స్ వాడితే గులిమిని మరింత లోపలికి వెళ్తుందని, వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 11 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Ear Tips: శరీరంలోని సున్నిత భాగాల్లో చెవిలోని పొర ఒకటి. అంతేకాకుండా చెవిలో చాలా నరాలు సున్నితత్వం కలిగి ఉంటాయి. చిన్న వస్తువు తాకినా ప్రమాదకరం అవుతుంది. చెవి వినిపించకపోవడం, ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది చెవులను ఇయర్ బడ్స్ సాయంతో క్లీన్ చేస్తుంటారు. దూదితో చేసినా సరే ఇయర్‌బడ్స్ వాడటం హానికరమని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల సంవత్సరానికి ఇంగ్లాడ్‌లో 7 వేల మందికి చెవి సంబంధిత సమస్యలు వచ్చాయని చెబుతున్నారు. చెవిలోపలి భాగాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. గులిమి తీసేందుకు బడ్స్ వాడితే గులిమిని మరింత లోపలికి వెళ్తుందని, వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెవిలో గులిమి రావడం అనేది ఒక సహజమైన ప్రక్రియ. కొన్ని గ్రంథులు గులిమిని స్రవిస్తాయని చెబుతున్నారు. గులిమి మామూలు స్థాయిలో ఉంటే ఏమీ నష్టం లేదని, ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయని, ఇమ్యూనిటీ సిస్టమ్‌కు సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా అయితే గులిమి కొన్ని రోజులకు దానంతట అదే పోతుందని అంటున్నారు. ఎలాంటి బడ్స్ ఉపయోగించకుండా అరగ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో చెంచా ఉప్పు వేయాలి. తర్వాత అందులో దూదిని ముంచి సమస్య ఉన్న చెవిలో నీటిని పిండాలి. 5 నిమిషాల పాటు చెవి అలాగే ఉంచి..తలను మరోవైపునకు వంచితే నీరు బయటికి వస్తుంది. దీంతో గులిమి కూడా పోతుంది. తర్వాత చెవులను శుభ్రం చేసుకోవాలి. అలాగే బేబీ ఆయిల్, మినరల్ ఆయిల్ కూడా వాడవచ్చు. గులిమిని తొలగించడంలో వేడి నూనె కూడా బాగా పనిచేస్తుంది. గిన్నెలో కొబ్బరి నూనె తీసుకుని గోరువెచ్చగా చేసి నాలుగు చుక్కలు చెవిలో వేసుకున్నా గులిమి పోతుంది. వేడినూనె గులిమి కరిగేలా చేస్తుంది. నైట్ పడుకునే ముందు చెవిలో నూనె వేసుకుని దూది పెట్టుకుని పడుకుంటే ఉదయాన్నే చెవిని వంచితే గులిమి బయటికి వస్తుంది. ఇది కూడా చదవండి: వీడెవడ్రా నాయనా..సంచితో షూట్ కుట్టించుకున్నాడు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #ear-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి