EAPCET : ఈఏపీసెట్ ఫలితాలు నేడు విడుదల! ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు. By Bhavana 11 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి EAPCET Results Today : ఇంజినీరింగ్ (Engineering), వ్యవసాయ (Agriculture), ఫార్మసీ కోర్సుల్లో (Pharmacy Course) ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు. ఈ విషయం గురించి సెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూ్ కాకినాడ వీసీ ప్రసాద్ రాజు వివరించారు. ఈ క్రమంలోనే ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్ ఛార్జ్ చైర్మన్ రామమోహన్ రావుతో కలిసి ఈఏపీసెట్ ఫలితాలను విడుదల (EAPCET Results 2024) చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఈఏపీ సెట్ ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించింది. ఈ సారి పరీక్షకు 3,62,851 మంది దరఖాస్తులు చేసుకోగా..వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ కు 2,58,373 మంది ,వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు సంబంధించి 80,766 మంది ఈ పరీక్షలు రాశారు. ఈ పరీక్షలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. దాని ఆధారంగానే ర్యాంకులను ప్రకటిస్తారు. Also read: 40 ఏళ్ల తరువాత అక్కడ లోక్ సభ స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్! #andhra-pradesh #vijayawada #results #eapcet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి