MLC Duvvada Srinivas Issue: ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భార్య మాధురికి (Divvala Madhuri) భర్త మహేష్ చంద్రబోస్ (Mahesh Chandrabose) మద్దతుగా నిలిచారు. రాజకీయాల్లో ఎదుగుతుందనే మాధురిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఓ టీవీ ఛానల్ లో ఆయన మాట్లాడుతూ.. మాధురిపై ఎవరు ఎన్ని చెప్పినా తాను పట్టించుకోనని, మాధురిని వదలనని అన్నారు. తన భార్యను రాజకీయాల్లోకి తీసుకెళ్లిందే వాణినేని భర్త దివ్వల మహేష్ స్పష్టం చేశారు. తనకు ఇష్టం లేకపోయినా మధురిని రాజకీయాల్లోకి పంపించానన్నారు. మాధరిపై తనకు నమ్మకం ఉందన్నారు.
Also Read: టీడీపీ కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీకి దూరం
ఇదిలా ఉంటే మరోవైపు దువ్వాడ శ్రీనివాస్, వాణి (Vani) మధ్య రోజురోజుకూ వివాదం ముదురుతుండడంతో దువ్వాడ శ్రీనివాస్, వాణి బంధువులు రంగంలోకి దిగారు. బంధువుల సమక్షంలో ఇరువురి కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. వాణి డిమాండ్లు ఏంటో తెలుసుకున్నారు. డిమాండ్లపై కుమార్తెలు, తల్లిదండ్రులతో వాణి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. చర్చల ద్వారా వివాదానికి ముగింపు పలకాలని బంధువులు ఇరువురికి సూచించారు.
Also Read: మస్తాన్ ఫోన్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు.. బెడ్‌రూమ్‌లో కెమెరాలు పెట్టి!
అయితే, దువ్వాడ శ్రీనివాస్, వాణి మధ్య రాజీ కుదరని పరిస్థితి కనిపిస్తోంది. ఐదు డిమాండ్లను బంధువుల ముందుంచిన వాణి.. ఆ డిమాండ్లను పరిష్కరిస్తేనే రాజీ అంటున్నట్లు తెలుస్తుంది. అయితే, భర్త దువ్వాడ శ్రీను మాత్రం తన ఇల్లు తప్ప అన్నీ ఇచ్చేస్తానంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై నిన్న రాత్రి వరకు వాణి తన కటుంబ సభ్యులతో చర్చలు కొనసాగించారు. వాణి వైపు నుంచి ఆమె సిస్టర్స్ రేఖ, రాధ.. దువ్వాడ శ్రీను వైపు నుండి సోదరుడు శ్రీధర్ చర్చలు జరిపారు. వాణి డిమాండ్లపై ఇవాళ చర్చించే అవకాశం కనిపిస్తుంది. కాగా, దువ్వాడ ఇంటి దగ్గర వాణి నిరసన ఇంకా కొనసాగుతుంది.