Haryana Politics: హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కూలబోతుందా ?

బీజేపీకి హర్యానాలో జరుగుతున్న రాజకీయాలు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా జేజేపీ ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా బలపరీక్ష కోరుతూ గవర్నర్‌కు లేఖ రాశారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోతే తక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని కోరారు.

New Update
Haryana Politics: హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కూలబోతుందా ?

JJP leader Dushyant Chautala: హర్యానా మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా బలపరీక్ష కోరుతూ గురువారం గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వానికి మెజారిటీ రాకపోతే తక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని కోరారు. హర్యానాలో రెండు నెలల క్రితం ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలో ఉందని చౌతాలా అన్నారు. వారికి మద్దతు ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు - ఒకరు బీజేపీ నుండి మరొకరు స్వతంత్ర ఎమ్మెల్యే బీజేపీకి తమ మద్దతును ఉపసంహరించుకున్నారని తెలిపారు.

ALSO READ: భారత్‌లో హిందువుల జనాభా తగ్గింది.. ముస్లింల జనాభా పెరిగింది.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి మద్దతుగా ఉన్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకుని గవర్నర్‌కు లేఖ రాశారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే మేం మద్దతు ఇస్తామని జేజేపీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. దీనిపై గవర్నర్‌కు లేఖ కూడా రాసినట్లు వివరించారు. ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ కూడా తమ బలాన్ని చూపేందుకు ఫ్లోర్ టెస్ట్ చేసుకోవాలని కోరారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏమైనా చర్యలు తీసుకోవాలా లేదా అనేది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలని అన్నారు.

ప్రభుత్వానికి బలం ఉందో లేదో తెలుసుకునేందుకు బల పరీక్షకు ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉందని, మెజారిటీ లేకుంటే వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను అమలు చేయాలని ఆయన అన్నారు. కాగా హర్యానాలో నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి జేజేపీ సిద్ధంగా ఉందని చౌతాలా ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు