AP Rains: అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాలో వానలే..వానలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.గురువారం,శుక్రవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
AP Heavy Rains : నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..అవసరమైతేనే బయటకు రండి!

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గురువారం,శుక్రవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల దృష్ట్యా అత్యవసర సహాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్లును 112, 18004250101 ,1070, ఏర్పాటు చేసినట్లు విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

ఎల్లుండి నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. తుఫాన్ హెచ్చరికలతో మత్స్యకారులు గురువారం నుంచి వేటకు వెళ్లొద్దని తెలిపారు.

Also Read: విద్యార్ధుల నిరసనతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్

Advertisment
తాజా కథనాలు