AP : వామ్మె.. ఫోన్ పేలి యువకుడు మృతి..!

అనకాపల్లి జిల్లా గాదిరాయిలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్ పేలి యువకుడు మృతి చెందాడు. వర్షం పడుతున్న సమయంలో గేదెల పాకపై పిడుగు పడింది. అయితే, పక్కనే ఉన్న మరో పాకలో భవాని శంకర్ (21) ఫోన్ పేలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే శంకర్ మృతి చెందాడు.

New Update
AP : వామ్మె.. ఫోన్ పేలి యువకుడు మృతి..!

Anakapalle : అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్ పేలి (Phone Blast) యువకుడు మృతి చెందాడు. వి. మాడుగుల మండలం గాదిరాయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గేదెల పాకపై పిడుగు పడింది. అయితే, పక్కనే ఉన్న మరో పాకలో భవానీ శంకర్‌ అనే యువకుడు ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు.

Also Read: స్కూల్ టీచర్ నిర్వాకం.. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా.. బాలికను ఎత్తుకెళ్లి..!

ఈ క్రమంలోనే పిడుగు (Thunder) పడడంతో భవానీ శంకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువకుడిని హుటాహుటినా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు.  భవానీ శంకర్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, వర్షాకాలం (Rainy Season) కావడంతో ఎప్పుడు పిడుగులు పడుతాయో చెప్పలేం.. కాబట్టి ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు