TSPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ వారమే డీఎస్సీ నోటిఫికేషన్!?

తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే టెట్ ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

New Update
TSPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ వారమే డీఎస్సీ నోటిఫికేషన్!?

Telangana : తెలంగాణ(Telangana) నిరుద్యోగులకు మరో తీపి కబురు అందనుంది. ఇటీవలే గ్రూప్-4 రిజల్ట్స్(Group-4 Results) రావడంతోపాటు గ్రూప్-1 నోటిఫికేషన్(Group-1 Notification) కూడా వెలువడింది. అయితే ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న బీఈడీ, డీఎడ్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌–2024ను ఈ వారమే విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధ చేసినట్లు సమాచారం.

మెగా డీఎస్సీకి రంగం సిద్ధం..
ఈ మేరకు సీఎం రేవంత్(CM Revanth) ఇటీవలే విద్యాశాఖ అధికారులతో సుధీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీలైనంత తొరగా మెగా డీఎస్సీ(Mega DSC) కి రంగం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని, ఈ వారమే 11,060 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు సీఎం ఆదేశాలతో విధ్యాశాఖ ఇప్పటికే నివేదికను సిద్ధ చేసి సీఎంవోకు పంపించగా.. సీఎంవోనుంచి పర్మిషన్ రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇక ఈ నోటిఫికేషన్ తో ఎస్ జీటీలో 6,500 పోస్టులు.. స్కూల్ అసిస్టెంట్ 2,600, పండిట్ 700, పీఈటీ 190 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇది కూడా చదవండి : VarunTej: సాయిపల్లవితో మరో సినిమా చేయను.. మెగా హీరో కామెంట్స్ వైరల్!

టెట్ సంవత్సరానికి రెండుసార్లు..
ఇదిలా వుంటే.. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్(TET) ను కూడా ఇకపై సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విద్యాశాఖ ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. ఇక గతంలో బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారే టెట్ రాసేవారు. కానీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు పేపర్-2 క్వాలిఫై కావాలనే నిబంధన ఉండటంతో టీచర్లు సైతం టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్ర ప్రభుత్వం వరుస నోటిఫికేషన్‌ విడుదల చేయబోతున్న నేపథ్యంలో నిరుద్యోగులతో ఆయా కోచింగ్‌ సెంటర్లు కళకళలాడుతున్నాయి. ఇప్పటికే గ్రూపు–2, గ్రూపు–3 పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయగా తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా రావడంతో నిరుద్యోగులతోపాటు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు