TG DSC: తెలంగాణలో మరో డీఎస్సీ.. టెట్‌ పరీక్షకు ప్రణాళిక ఖరారు!

తెలంగాణలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలపై విద్యాశాఖ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే 2024 డిసెంబర్ లేదా 2025 జనవరిలో నోటిపికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

New Update
Telanagna: డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

TG DSC: తెలంగాణలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే 11,062 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా మరోసారి దాదాపు 6 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవలే మరో డీఎస్సీపై హామీ ఇవ్వగా.. విద్యాశాఖ ఖాళీల ఎన్ని ఉన్నాయనే అంశంపై కసరత్తులు మొదలుపెట్టింది. ఈ మేరకు ప్రస్తుతం 11,062 పోస్టులకు సంబంధించిన ప్రక్రియను సెప్టెంబర్ నెలలో పూర్తి చేసి అక్టోబరు నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అప్పుడే కొత్త ఖాళీల సంఖ్యపై స్పష్టత..
ఈ ప్రక్రియ పూర్తి కాగానే 2024 డిసెంబర్ లేదా 2025 జనవరిలో కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నోటిపికేషన్ రిలీజ్ చేసే యోచనలో ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్ కు మందు మరోసారి టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్షకు మూడు లేదా రెండు నెలల ముందు టెట్ పరీక్షలు పెట్టేలా విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేస్తేగానీ కొత్తగా ఉండే ఖాళీల సంఖ్యపై స్పష్టత రానుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా.. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీగాఉన్న అందుకు సరిపడ విద్యార్థులు లేరు. దీంతో క్రమబద్ధీకరణను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు టీచర్లను బదిలీ చేయాలని చూస్తోంది.

యూనివర్సీటీలకు కొత్త వైస్‌ ఛాన్సలర్లు..
ఇదిలా ఉంటే.. తెలంగాణలోని యూనివర్సీటీలకు కొత్త వైస్‌ ఛాన్సలర్ల నియమించేందుకు సెర్చ్‌ కమిటీ సమావేశాలను పూర్తి చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఐఏఎస్‌ అధికారులు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తుండగా.. వీసీల నియామకం కోసం ప్రభుత్వం నోటీఫికేషన్‌ విడుదల చేసింది. విశ్వవిద్యాలయాల వారీగా సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. 2,3 రోజుల్లో ఈకమిటీల సమావేశం షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉంది. మరోవైపు వీసీలతో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌, సభ్యుల నియామకాలను చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు