BIG BREAKING: డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో వేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 28 Feb 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి DSC Notification Cancelled: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో వేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ALSO READ: పెన్షన్ రూ.5000లకు పెంపు! రేపు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్?.. తెలంగాణ (Telangana) టీచర్ పోస్టుల (Teacher posts) భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భర్తీ చేసే టీచర్ల పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. మే 3వ వారంలో ఈ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించకున్నారు. సుమారు పది రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ని కూడా అధికారులు ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11, 062 టీచర్ పోస్టులకు అనుమతి కూడా లభించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే లేటు. ముందుగా ఫిబ్రవరి 28 బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు భావించారు. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూష్ తో పాటు మరికొన్ని తుది మెరుగులు దిద్దుకోవడం కోసం మరో రోజు ఆలస్యం అయ్యింది. డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులు.. గతంలో ప్రకటించిన డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో డీఎస్సీ పై చాలా మంది నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4 లక్షల మంది టెట్ ఉత్తీర్ణత పొందారు. దీంతో డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు.దీంతో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రశ్నపత్రాలతో పాటు రిజల్ట్స్ వరకూ మొత్తం సాంకేతికతనే ఉపయోగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. #cm-revanth-reddy #dsc-notification #telangana-latest-news #dsc-notification-cancelled మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి