DSC: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు!

ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ ను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. 6,100 టీచర్‌ పోస్టుల ప్రకటన క్యాన్సిల్ చేసి 16,347లతో మెగా డీఎస్సీని ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
DSC: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు!

AP DSC NOTIFICATION: ఏపీలో గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను టీడీపీ సర్కారు రద్దు చేసింది. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన 6,100 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

16,347లతో మెగా డీఎస్సీ..
ఈ మేరకు మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో వైసీపీ ప్రకటించిన 6,100 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేస్తూ.. మరిన్ని పోస్టులు పెంచి 16,347లతో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన టెట్‌ పరీక్షలో అర్హత సాధించని వారు ఈ టెట్‌ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్‌ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఒకేసారి టెట్, మెగా డీఎస్సీకి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్‌ నిర్వహించి ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. జులై 1న మెగా డీఎస్సీ, టెట్‌కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకపోగా.. కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు