Diabetes: ఈ సూపర్‌ ఫుడ్స్‌ మధుమేహాన్ని కంట్రోల్‌ చేయడంలో బెస్ట్!

మధుమేహంతో బాధపడేవారికి జీడి పప్పు సరైన ఎంపిక. వీటిలోని మంచి కొవ్వులను శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి. పిస్తా, డ్రైడ్ ఫీగ్స్, డ్రైడ్ అప్రీకట్స్, వాల్ నట్స్ కూడా చాలా డయాబెటిస్‌ పేషెంట్లకు మంచివి. వీటి ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.

New Update
Diabetes: ఈ సూపర్‌ ఫుడ్స్‌ మధుమేహాన్ని కంట్రోల్‌ చేయడంలో బెస్ట్!

మధుమేహం సమస్య ఉన్నవారు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. వీటిలోని తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. డ్రైడ్ ఫిగ్స్, డేట్స్, బాదం, పిస్తా, డ్రైడ్ అప్రికాట్స్ తీసుకోవాలి.

ఈ మధ్య చాలా మందిలో సహజంగా కనిపిస్తున్న సమస్య మధుమేహం. ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానాలు మధుమేహానికి ముఖ్య కారణాలుగా ఉంటున్నాయి. అయితే ఈ సమస్య ఉన్నవారు రోజూ తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని చెపుతున్నారు నిపుణులు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పిస్తా
పిస్తాలో తక్కువ గ్లైసెమిక్ వాల్యూ ఉంటుంది. అలాగే వీటిలో హై ఫైబర్, ప్రోటీన్ తో పాటు మంచి కొవ్వులు ఉంటాయి. డైలీ డైట్ లో వీటిని తీసుకోవడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.

జీడిపప్పు
అధ్యయనాల ప్రకారం మధుమేహంతో బాధపడేవారికి జీడి పప్పు సరైన ఎంపిక. వీటిలోని మంచి కొవ్వులను శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి.

వాల్ నట్స్
సహజంగా వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, హై ఫైబర్ శరీరంలోని అధిక షుగర్ లెవెల్స్ పై మంచి ప్రభావం చూపుతాయి.

డ్రైడ్ అప్రీకట్స్
డయాబెటిక్ రోగులకు డ్రైడ్ అప్రీకట్స్ సరైన చాయిస్. వీటిలోని హై డైటరీ ఫైబర్, తక్కువ గ్లైసేమిక్ వాల్యూ షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో తోడ్పడతాయి.

డ్రైడ్ ఫీగ్స్
అంజీరాలోని తక్కువ షుగర్, తక్కువ కేలరీలు అధిక చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే బాదంలోని హై మెగ్నీషియం, జీరో గ్లైసేమీక్ ఇండెక్స్ షుగర్ లెవెల్స్ పై ప్రభావంగా పనిచేస్తాయి.

Also Read: పెంపుడు జంతువులతో కలిసి నిద్రిస్తే ఏమవుతుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు