Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

పోలీసులు ఎన్ని చర్యలు తీసకుంటున్నా కేటుగాళ్లు మాత్రం డ్రగ్స్‌ను పలు కొత్త దారుల్లో నగరానికి తీసుకొస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి వ్యాపారస్తులకు అంటగడుతున్నారు. తాజాగా.. మాదాపూర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఇందులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు.

New Update
Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Drugs: ఒకవైపు డ్రగ్స్ , దానిని తీసుకొచ్చిన వాళ్ళను ఎక్కడిక్కడ పట్టుకుంటూనే ఉన్నారు హైదరాబాద్ పోలీసులు.మరోవైపు కొత్త డ్రగ్ డీలర్స్, దానిని అమ్మడానికి కొత్త దారులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా మాదాపూర్‌లో పోలీసులు డ్రగ్స్ అమ్ముతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తీసుకొస్తున్న సాయి చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ని చిన్న చిన్న ప్యాకెట్లలోకి మార్చి ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్స్ ద్వారా నిందితుడు సాయి చరణ్ సరఫరా చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నలుగురు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వ్యాపారవేత్తలతో పాటు ప్రధాన నిందితుడు సాయిచరణ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి,రాహుల్ ,సుబ్రహ్మణ్యం‌లను నార్కో టిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనూ డ్రగ్స్ కేసులో సాయిచరణ్‌ను డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. 50 మంది వ్యాపారవేత్తలకు నిందితుడు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ రాజమండ్రి, వైజాగ్‌లో ఉన్న వ్యాపారవేత్తలకు డ్రగ్ సరఫరా చేస్తున్నారని అన్నారు. రాజేశ్వరి ట్రావెల్స్, జీవీఆర్, స్టార్ట్, చెర్రీ ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తు్న్నాడని పోలీసులు వివరించారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:Telangana: జూలై 1 నుంచే నెలకు రూ.2500.. మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

Advertisment
Advertisment
తాజా కథనాలు