Waynad Landslides: వయనాడ్ లో కొండచరియలు సృష్టించిన విషాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని ఆవేదన మిగిల్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుమారు 320 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇంకా 300 మందికి పైగా ప్రజల ఆచూకీ లభించాల్సి ఉంది. కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన వారి కోసం సహాయక చర్యలను వేగవంతం చేశారు.
మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ ను ఉపయోగించనున్నట్లు అధికారులు ప్రకటించారు. భారత సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్‌ఎఫ్,తీర రక్షక దళం, ప్రభావిత ప్రాంతాల్లో కలిసికట్టుగా గాలింపు చర్యల్లో పాల్గొననున్నాయి. ఈ బృందాల్లో ముగ్గురు స్థానికులు, ఓ అటవీ శాఖ ఉద్యోగి భాగం కానున్నారు. విపత్తు సంభవించిన ప్రాంతాన్ని ఆరు జోన్లుగా విభజించి 40 బృందాలు గాలింపు చర్యలు చేపట్టనున్నాయి.
Also read: హమాస్-ఇజ్రాయెల్ యుద్దం…రద్దైన ఎయిర్ ఇండియా విమానం!