Maha Shivratri 2024: ప్రతీ సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం నాల్గో రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు. ఇవాళే మహాశివరాత్రి. మత విశ్వాసల ప్రకారం శివుడితో పార్వతికి వివాహం ఆ రోజే జరిగింది. అందుకే ఆ రోజున శివ కల్యాణాన్ని ఆలయాల్లో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పవిత్ర రోజున భక్తులు దేవాలయాలలో పూజలు చేస్తారు. ఉపవాసం పాటిస్తారు. శివుడితో పాటు పార్వతీ దేవిని పూజిస్తారు. శివరాత్రి నాడు కొందరు కఠోర ఉపవాస దీక్ష చేస్తారు.. మరికొందరు పండ్లు తినడం ద్వారా ఉపవాసం ఉంటారు. మీరు కూడా అలాంటి వ్యక్తులలో ఒకరు అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. ఉపవాసానికి సరైన ఎంపిక అయిన కొన్ని పానీయాల గురించి మేము మీకు చెప్పబోతున్నాం. ఈ పానీయాలు తాగడం వల్ల మీ కడుపు నిండుగా ఉండటమే కాకుండా రోజంతా మీ శరీరంలో శక్తి ఉంటుంది.
బొప్పాయి:
- బొప్పాయిలో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి. అవి శరీరాన్ని ఎక్కువ సేపు శక్తివంతంగా ఉంచుతాయి. బొప్పాయి జ్యూస్ శరీరాన్ని చాలా హైడ్రేట్‌గా ఉంచుతుంది. మీరు బొప్పాయి జ్యూస్‌ని మహాశివరాత్రి ఉపవాసం సమయంలో తాగవచ్చు.
జామ:
- ఉపవాసం సమయంలో జామ పండుతో చేసిన సిరప్ తాగవచ్చు. రోజంతా మీ శరీరంలో శక్తి చెక్కుచెదరకుండా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులువే.
స్ట్రాబెర్రీ:
- మీ ఇంటి చుట్టుపక్కల స్ట్రాబెర్రీలు సులభంగా దొరికితే ఉపవాసం రోజున మీరు స్ట్రాబెర్రీ షేక్‌ని తయారు చేయవచ్చు. ఇది తాగితే చాలా సేపు డీహైడ్రేట్ కాకుండా ఉంటాం.
- వీటితో పాటు సాధారణ మిల్క్ షేక్స్ కూడా తాగవచ్చు. ఇవి తాగితే కడుపు నిండుగా ఉంటుంది. దీనితో పాటు మీ శరీరంలో శక్తి కూడా చెక్కుచెదరకుండా ఉంటుంది. ఉపవాసం చేయాలి కానీ మన ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టి కాదు.. అందుకే పండ్ల రసాలతో కడుపును నింపుకోని దేవుడిని ప్రార్థించవచ్చు. ఉపవాసం ఎఫెక్ట్ అన్నది ఒక మనిషికి ఇంకో మనిషికి ఒకేలా ఉండదని గుర్తుపెట్టుకోవాలి.
ఇది కూడా చదవండి: శివరాత్రి రోజు పొరపాటున కూడా ఈ విషయాలను విస్మరించకండి..ఈ రోజున ఏం చేయాలి..ఏం చేయకూడదంటే!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.