Plastic Bottle: ప్లాస్టిక్‌ బాటిల్‌కి బీపీకి సంబంధం ఏంటి..? ఈ నీటికి ఉంటేనే మంచిదా..!!

ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ప్లాస్టిక్ బాటిల్‌లోని నీరు తాగితే అందులోని మైక్రోప్లాస్టిక్స్‌ రక్తంలో కలిసి బీపీ వచ్చే ప్రమాదం ఉంటుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో ప్లాస్టిక్ బాటిల్స్ వాడకాన్ని తగ్గించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Plastic Bottle: ప్లాస్టిక్‌ బాటిల్‌కి బీపీకి సంబంధం ఏంటి..? ఈ నీటికి ఉంటేనే మంచిదా..!!
New Update

Plastic Bottle: మనుషులకే కాదు భూమిపై జీవిస్తున్న ప్రతి జీవికి నీరు ఎంతో ముఖ్యం. శరీరానికి తగినంత నీరు ఉంటే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతుంటారు. అందుకే రోజు మొత్తంలో కనీసం 8 లీటర్ల నీళ్లు తాగాలని చెబుతారు. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మన ఆరోగ్యానికి దెబ్బ పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఒకటి ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగడం. ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు తాగకూడదు:

ప్లాస్టిక్ వాడకం తగ్గించమని నిపుణులు చెబుతూనే ఉంటారు. కానీ నేటి కాలంలో దాని వాడకం చాలా ఎక్కువైంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నా గానీ మనం వారి వినటం లేదు. అయితే తాజాగా చేసిన సర్వేలో ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు తాగడం వల్ల బీపీ పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెళ్లడైనది. అంతేకాదు ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్‌లో మైక్రోప్లాస్టిక్స్‌ రక్తంలో కలుస్తుందని దీనివలన బీపీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ బాటిల్‌లో కాకుండా వేరే బాటిల్స్‌లో నీరు తాగటం వలన బీపీ తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో వెళ్ళడైనది.

గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిది:

ఈ ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగితే హార్మోన్ల అసమతుల్యంతో పాటు హృదయ సంబంధ సమస్యలు, క్యాన్సర్ వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ప్లాస్టిక్ ఫుడ్ తీసుకుంటే మైక్రో ప్లాస్టిక్స్‌ శరీరంలోకి వెళ్తుంది. దీనివలన అనేక సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నీ తగ్గించుకోవాలి అంటే నీటిని వేడి చేసి గోరువెచ్చని నీటిని తాగాలని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల మైక్రోప్లాస్టిక్ శరీరంలోకి వెళ్లకుండా నియంత్రించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి:  ఆ పువ్వులతో అలర్జీ.. వివరాలివే!

#plastic-bottle
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe