Jonna Ambali: జొన్న పిండితో మలబద్దకం పరార్.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు!

చిరు ధాన్యాల్లో జొన్నలు ఒక‌టి. జొన్నల్లో క్యాల్షియం, ఫాస్ఫర‌స్, ఐర‌న్‌తోపాటు పీచు ప‌దార్థాలు పుష్కలంగా ఉంటాయి. జొన్న పిండితో అంబ‌లిని చేసి తాగితే నీర‌సం, బ‌ల‌హీన‌త, రక్తహీన‌త, మ‌ల‌బ‌ద్దకం వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి.

New Update
Jonna Ambali: జొన్న పిండితో మలబద్దకం పరార్.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు!

Jonna Ambali Benefits: మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు ఒక‌టి. ప్రస్తుత కాలంలో వీటి వాడకం ఎక్కువైంది. జొన్నలు ఆహారంగా తీసుకుంటే అనారోగ్య స‌మ‌స్యలు తగ్గి.. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జొన్నల్లో క్యాల్షియం, ఫాస్ఫర‌స్, ఐర‌న్‌తోపాటు పీచు ప‌దార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ మంది జొన్న రొట్టెలు తింటారు. అయితే.. ఈ రొట్టెలతోపాటు జొన్నల‌తో అంబలిని చేసుకుని తాగ‌వ‌చ్చు. జొన్న అంబ‌లిని తాగితే రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని సొంతం అవుతుదంని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జొన్న అంబ‌లిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ జొన్న అంబ‌లిని రుచిగా ఉండ‌డంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ అంబ‌లిని తాగితే మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు జరుగుతుందో ఆ విషయాన్ని ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: దాల్చిన‌చెక్క, నిమ్మకాయ‌ను ఇలా తీసుకుంటే చాలు.. బ‌రువు మొత్తం త‌గ్గుతారు..!

ఒక గిన్నెలో కొద్దిగా జొన్న పిండి, ఉప్పుని వేసి దానిలో మూడు గ్లాసుల నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా కలుపుకోవాలి. త‌రువాత ఈ గిన్నెను స్టవ్ మీద పెద్ది చిన్న మంట‌పై క‌లుపుతూ ఉడికించాలి. ఈ అంబ‌లిని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. త‌రువాత దీనిని ఓ గ్లాస్‌లోకి తీసుకుని అందులో నిమ్మర‌సం, మిరియాల పొడి వేసి క‌ల‌పితే ఎంతో రుచిగా ఉండే జొన్న అంబ‌లి రడీ త‌యార‌వుతుంది. ఈ విధంగా జొన్న పిండితో అంబ‌లిని చేసి తాగితే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భించి నీర‌సం, బ‌ల‌హీన‌త, రక్తహీన‌త, మ‌ల‌బ‌ద్దకం వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి. ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల జీర్ణశ‌క్తి పెరిగి, ఎముక‌లు ధృడంగా ఉంటాయి.

వ్యాయామాలు చేసే వారికి ఈ అంబ‌లి బెస్ట్

ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల బ‌రువు తగ్గాల‌నుకునే వారికి మంచి ఫలితం ఉంటుంది. అలాగే.. ఈ అంబ‌లిని శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొల‌గి.. గుండె ఆరోగ్యంగా ప‌ని చేస్తోంది. అంతేకాకుండా ఈ అంబ‌లిని తాగితే శ‌రీరంలో వేడి త‌గ్గి, కండ‌రాలు ధృడంగా, షుగ‌ర్ స్థాయిలు నియంత్రణ‌లో ఉంటాయి. వ్యాయామాలు చేసే వారు ఈ అంబ‌లిని ప్రతిరోజూ తాగితే మంచి ఫ‌లితం వస్తుంది. ఈ విధంగా జొన్నల‌తో చేసిన అంబ‌లి మ‌న ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని పిల్లల, పెద్ద వారి ఎవ‌రైనా తాగవచ్చు. అయితే.. జొన్నల‌తో రొట్టెలే కాకుండా అంబ‌లిని తాగితే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు