Soda,Cold Drinks: చాలా మందికి భోజనం చేసిన తర్వాత పొట్టలో ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కొందరూ సోడా, కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. మరి కొందరు అయితే నిమ్మకాయ సోడాలో ఉప్పు కలిపి తాగుతారు. ఇలా తాగటం వలన కడుపులో కాస్తా రిలాక్స్‌గా ఉంటుందని అనుకుంటారు. కానీ..ఇలా తాగితే తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగడం చాలామందికి అలవాటు. దీనివల్ల కడుపులో హాయి కంటే సమస్యలే ఎక్కవగా ఉన్నాయి. అయితే.. భోజనం తిన్నాక సోడా తాగితే ఎక్కువగా తినాలనే కోరికలు తగ్గుతాయి. వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్టుగా అనిపిస్తుంది. కానీ..ఇది తాత్కాలికంగా మాత్రమే. అంతేకాదు తిన్నాక సోడా తాగితే గ్యాస్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు చాలా సమస్యలొస్తాయి. అవేంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
భోజనం తరువాత సోడా తాగితే..
- భోజనం చేశాక సోడా తాగితే ఆకలిని పెంచుతుంది. వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్టుగా అనిపిస్తుంది.
- ఇది తాత్కాలికంగా మాత్రమే. తిన్నాక సోడా తాగడం వలన గ్యాస్ పెరుగుతుంది. దీంతో అనేక సమస్యలు వస్తాయి.
- కడుపులో గ్యాస్ పెరిగితే పొట్ట నొప్పి వస్తంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
- గ్యాస్ ఉన్నప్పుడు కూర్చోలేక, నించోలేక చాలా ఇబ్బందిగా ఉంటుంది.
- కొంతమందికి గుండెల్లో మంట, వెన్నునొప్పి, ఛాతీ నొప్పి వచ్చే అవకాశం ఉంది.
- భోజనం మధ్యలో నీరు తాగొద్దు. తిన్న తర్వాత గోరు వెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.
- ఇలా చేస్తే తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
- తిన్న తర్వాత కొంతమంది జ్యూస్ కూడా తాగుతారు. ఇలా తాగడం అస్సలు మంచిది కాదు.
- దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- బరువు కూడా పెరుగుతారు. అందుకే..వీటిని తాగకపోవడమే ఆరోగ్యానికి మంచిది.
ఏం బెస్ట్ అంటే..
- తిన్న తర్వాత వేడినీరు తాగడం మంచిది.
- భోజనం మధ్యలో నీరు తాగొద్దు.
- భోజనం తిన్న తర్వాత కాసేపటికి గోరువెచ్చని నీరు, జీలకర్ర నీరు బెస్ట్.
- మీకు ఏం తాగడం ఇష్టం లేకపోతే గోరువెచ్చని నీరు తాగండి.
- తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: ఈ మొక్కలు పెంచితే..ఇంట్లోకి పిల్లులు రావు..! ట్రై చేయండి!