Pumpkin Juice: వీరి వీరి గుమ్మడి..దీనిలో పోషకాల ప్రత్యేకతే వేరండీ..!! గుమ్మడికాయ భారతీయ ఇంటిలో ఉపయోగించే ఒక కూరగాయ. గుమ్మడికాయ రసం తాగితే మధుమేహానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను, ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఈ రసం ఎంతో ఉపయోగపడుతుంది. By Vijaya Nimma 18 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Pumpkin Juice: గుమ్మడికాయను గుమ్మడికాయ కూర, హల్వా, రైతా, పకోడా వంటి వివిధ వంటలలో వాడుతారు. గుమ్మడికాయ రసం మధుమేహానికి ప్రయోజనకరంగా, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, ఊబకాయాన్ని నియంత్రించడంలో, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. గుమ్మడికాయ రసంలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్-సి, బి6 వంటి పోషకాలున్నాయి. గుమ్మడికాయ రసం కంటి ఆరోగ్యానికి, బలమైన రోగనిరోధక శక్తిని, చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఈ కూరగాయ జ్యూస్ సీసా సొరకాయ రసం కంటే 50 రెట్లు శక్తివంతమైనది. గుమ్మడికాయ కూరగాయను పిల్లలైనా, పెద్దలైనా తక్కువ మంది ఇష్టపడతారు. కానీ.. దాని స్వీట్లను ఇష్టపడేవారు ఎక్కవ మందే ఉన్నారు. గుమ్మడికాయ రుచితో పాటు దాని గుణాలను తెలిస్తే దాటిని ఇష్టంగా తింటారు.గుమ్మడికాయలో ఉండే విటమిన్ ఎ, సి, ఇ, పొటాషియం, కాల్షియం, ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్లు దాని ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతాయి. గుమ్మడికాయ రసం మధుమేహానికి దివ్యౌషధం. రోజూ గుమ్మడికాయ జ్యూస్ తాగితే.. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రోజు మనం ఈ జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. గుమ్మడికాయలో పోషకాలు గుమ్మడికాయలో ప్రొటీన్, పీచు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్- సి, బి6 వంటి పోషకాలున్నాయి. గుమ్మడికాయ జ్యూస్ తాగితే మధుమేహం, స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. డయాబెటిక్ రోగులకు గుమ్మడికాయ రసం చక్కగా పనిచేస్తుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించి, రక్తంలో చక్కెరను తక్కువగా ఉంచుతుంది. ఈ జ్యూస్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. పొట్ట వ్యాధులకు గుమ్మడికాయ రసం దివ్యౌషధం. ఇది జీర్ణశక్తిని చక్కగా ఉంచుతుంది. గుమ్మడికాయ రసం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే పోషక గుణాలు వ్యాధులతో పోరాడుతుంది. మలబద్ధకం సమస్య ఉంటే.. గుమ్మడికాయ రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుమ్మడికాయ రసం తయారీ గుమ్మడికాయ రసం చేయడానికి.. ముందు పై తొక్క తీసుకోవాలి. దీన్ని తురుము, మిక్సర్ గ్రైండర్‌లో పుదీనా ఆకులతో కలిపి జ్యూస్‌లా చేసుకోవాలి. అది మందంగా ఉంటే కొద్దిగా నీరు కలుపుకోని వడగట్టిన తర్వాత నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి తాగాలి. ఇది కూడా చదవండి: మొండి కొవ్వును కూడా కరిగించే డ్రింక్..ట్రై చేయండి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #health-benefits #drinking-pumpkin-juice మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి