Empty Stomach: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఈ సమస్యలు తప్పవు

నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరిచడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఆసిడ్ రిఫ్లక్స్‌కు గురికావటంతో పాటు కడుపు నొప్పి, గుండెల్లో మంట, అజీర్ణం, డీహైడ్రేషన్‌కు గురవ్వాల్సి వస్తుంది. నిమ్మలో ఉండే ఆమ్లం ఎనామిల్‌ను దెబ్బతిస్తుంది.

Empty Stomach: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఈ సమస్యలు తప్పవు
New Update

Empty Stomach: చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతుంటారు. నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరిచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరం నుంచి విష పదార్థాలను కూడా బయటికి పంపుతుంది. కానీ ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మకాయ నీటిని తాగడం వల్ల ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మరసం తాగితే దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్లం కారణంగా ఎక్కువగా తీసుకుంటే దంతాల రక్షణ పొర అయిన ఎనామిల్‌ను దెబ్బతింటుందని చెబుతున్నారు.

గుండెల్లో మంట, అజీర్ణం సమస్యలు:

అందుకే డైరెక్ట్‌గా తాగడం కంటే స్ట్రా ద్వారా నిమ్మకాయ నీటిని తాగాలని, ఆ తర్వాత నీళ్లతో నోటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో నిమ్మకాయ రసం తాగితే ఆసిడ్ రిఫ్లక్స్‌కు గురికాక తప్పదు. నిమ్మకాయల్లో ఉండే ఆమ్లగుణం కారణంగా గుండెల్లో మంట, అజీర్ణం బాగా పెరుగుతుంది. ఒకవేళ మీరు యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించి ప్రతిరోజూ ఆరెంజ్‌ జ్యూస్‌ తాగవచ్చు. ఖాళీ కడుపుతో వేడి నిమ్మకాయ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. నిమ్మకాయలోని ఆమ్ల స్వభావం కడుపులోని లైనింగ్‌పై ప్రభావం చూపుతుంది.

డీహైడ్రేషన్‌కు గురవ్వాల్సిందే:

దీని కారణంగా వికారం, గుండెల్లో మంట, కడుపు నొప్పి వస్తుంది. ఈ అసౌకర్యం అనిపిస్తే నిమ్మరసం తాగే అలవాటు మానేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. నిమ్మకాయ నీళ్లు తాగితే తరచూ మూత్రం రావడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవ్వాల్సి వస్తుంది. డీహైడ్రేషన్‌ను నివారించడానికి రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. నిమ్మరసం తాగిన తర్వాత యాంటీబయాటిక్స్, థైరాయిడ్ మందులు వేసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. కొందరికి నిమ్మకాయలు, నిమ్మరసం వల్ల అలర్జీ వస్తుంది. అలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

ఇది కూడా చదవండి: అంతరించిపోతున్న ఉడతలు.. ఫారెస్ట్ అధికారులు ఏం చేశారంటే..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#empty-stomach #health-problems #lemon-juice
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe