Beetroot Juice : బీట్‎రూట్ జ్యూస్ తాగితే కార్డియాలజిస్ట్‎తో పనే ఉండదు..!!

బీట్‌రూట్ జ్యూస్‌కి అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసే శక్తి ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రక్తపోటు, గుండె సమస్యలకు బీట్ రూట్ చాలా మేలు చేస్తుంది.

New Update
Health Tips : బీపీ అదుపులో ఉండాలంటే.. ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగండి..!

Beetroot Juice: గత రెండు, మూడేళ్లుగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం నిజంగా భయానకమే. ఒక వ్యక్తికి తీవ్రమైన గుండెపోటు వస్తే పెద్ద ఆసుపత్రిలో డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి! కాబట్టి ఈ చిన్ని గుండె ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మారుతున్న జీవనశైలితోపాటు ఆహారపు అలవాట్లు కూడా అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. మన చిన్న గుండెను భద్రంగా ఉంచుకోవాలంటే మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో మార్పులు తప్పనిసరి.

క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నేటి కాలంలో చాలా మంది ఆహారంపై శ్రద్ధ చూపడం లేదు. ఇవన్నీ కూడా గుండెజబ్బులు, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. పండ్లు, కూరగాయలు, ప్రొటీన్ అధిక ఉండే ఆహారపదార్థాలను నిత్యం ఆహారంలో చేర్చుకోవాలి. వీటితోపాటు బీట్ రూట్ (Beetroot Juice) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుతుంది. దీని జ్యూస్ నిత్యం తాగినట్లయితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: 40లో 20లా కనిపించాలంటే ఈ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోండి.

గుండెపోటుకు ప్రధాన కారణం:
అనారోగ్యకరమైన ఆహారం రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు, తెల్ల రక్త కణాలు చేరడానికి దారితీస్తుంది. అలాంటప్పుడు, గుండె భాగానికి రక్తం సరిగ్గా ప్రవహించదు. గుండె రక్త నాళాలపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా, గుండెపోటు సంభావ్యత ఎక్కువగా ఉండి గుండెపోటుకు దారి తీస్తుంది.

బీట్‌రూట్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:
రెడ్ వెజిటేబుల్ గా పేరొందిన బీట్ రూట్ లో ఆరోగ్యానికి కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మన రక్త ప్రసరణలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. గుండె ధమనుల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరైన రక్త సరఫరాను నిర్ధారిస్తాయి.

బీట్‌రూట్ ఉపయోగం:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ రోజువారీ ఆహారంలో నైట్రేట్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటును తగ్గించవచ్చు. గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు. బీట్‌రూట్‌లో అధిక స్థాయి నైట్రేట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఈ కూరగాయలను తీసుకోవడం లేదా దాని రసం తాగడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బీట్ రూట్ లో లభించే నైట్రేట్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది.

ఇది కూడా చదవండి: ఖర్జూర గురించి ఈ సీక్రెట్ రోజూ తినకుండా అసలు వదిలిపెట్టరు!!

నైట్రేట్ కంటెంట్:
బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్ కంటెంట్ హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకని ఇప్పటికే రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ కూరగాయ తీసుకోవడం లేదా దీని రసం తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బీట్‌రూట్ జ్యూస్‌లో చక్కెర కలపకుండా 15 రోజులు తీసుకుంటే, అది అధిక రక్తపోటును నియంత్రించడమే కాదు ..గుండెకు సరైన రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. అంతేకాకుండా, ఈ కూరగాయలలో ఉండే పొటాషియం కంటెంట్ నాడీ వ్యవస్థ, కండరాల సరైన పనితీరుకు అవసరమవుతుంది. అంతేకాదు వృద్ధాప్య ప్రక్రియను కూడా తగ్గిస్తుంది.

బీట్‌రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలి?
మీడియం సైజులో ఉండే రెండు బీట్‌రూట్‌లను నీటిలో వేసి సరిగ్గా శుభ్రం చేసి, తొక్కతీయండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ బ్లెండర్‌లో వేసి అందులో నుంచి రసాన్ని తీయాలి. రుచి కోసం సగం నిమ్మకాయ రసం కలపుకోవచ్చు. ఈ జ్యూసులో చక్కెర జోడించవద్దని గుర్తుంచుకోండి.

(Disclaimer:ఈ కథనం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీన్ని ధృవీకరించలేదు, బాధ్యత వహించదు. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం)

Advertisment
Advertisment
తాజా కథనాలు