Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ - రామ్ లుక్ అదుర్స్, టీజర్ ఆరోజే?

రామ్ పోతినేని బర్త్ డే కానుకగా 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ని మే 15 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా తెలియజేసారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ పోతినేని ఊరమాస్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ - రామ్ లుక్ అదుర్స్, టీజర్ ఆరోజే?
New Update

Double Ismart Teaser : టాలీవుడ్ సినీ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘డబుల్ ఇస్మార్ట్' కూడా ఒకటి. ‘ఇస్మార్ట్ శంకర్’ కి ఇది సీక్వేల్ కావడం, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తుడటంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవలే మూవీ టీమ్ ముంబై లో లీడ్ యాక్టర్స్ పై కీలక సన్నివేశాలను షూట్ చేసారు. ఇదిలా ఉంటె ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తూ ఓ పోస్టర్ ని వదిలారు.

Also Read : కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ?

మే 15 న టీజర్

రామ్ పోతినేని బర్త్ డే కానుకగా 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ని మే 15 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా తెలియజేసారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ పోతినేని ఊరమాస్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. పోస్టర్ చూస్తే పూరీ జగన్నాథ్ ఈసారి మాస్ డోస్ మరింత పెంచినట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని తెలుగు, తమిళ్,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. జూలై లో ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

#ram-pothineni #double-ismart-teaser
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe