Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' నుంచి 'స్టెప్పమార్' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. రామ్ ఊరమాస్ స్టెప్స్ అదుర్స్! 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ 'STEPPAMAAR' ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ సాంగ్ కంప్లీట్ మాస్ బీట్ తో సాగింది. మణిశర్మ మరోసారి అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు ఈ సాంగ్‌తో అర్థమైపోతుంది. అనురాగ్ కులకర్ణి, సాహితి ఈ పాటను పాడారు. By Anil Kumar 01 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Double Ismart First Single SteppaMaar Out : ఉస్తాద్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) - డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ బ్యూటీ కావ్య థాపర్ (Kavya Thapar) కథానాయికగా నటించగా.. సంజయ్ దత్, బన్ని జె, అలీ, గెటప్ శ్రీను, సాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన మూవీ టీజర్ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. ఇటీవల మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ ప్రోమోను వదిలారు. అందులో జూలై 1 న ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. చెప్పినట్టుగానే నేడు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'STEPPAMAAR' ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కంప్లీట్ మాస్ బీట్ తో సాగింది.మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు తాజా సాంగ్‌తో అర్థమైపోతుంది. Also Read : బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ర్యాంపేజ్.. రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన ‘కల్కి’..! ప్రముఖ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, సాహితి పాడిన ఈ పాటలో హీరో రామ్ సైతం తన గొంతు కలిపాడు. పాటలో వచ్చే కొన్ని హుక్ లైన్స్ ను రామ్ తో పాడించడం హైలైట్ అనే చెప్పాలి. అంతేకాదు మధ్యలో కొన్ని సార్లు పూరీ డైలాగ్స్ కూడా వినిపించాయి. ఇక రామ్ డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో రామ్ మరోసారో ఊరమాస్ స్టెప్స్ తో అదరగొట్టేసాడు. రానున్న రోజుల్లో ఈ సాంగ్ తో పాటూ రామ్ వేసిన స్టెప్స్ సోషల్ మీడియా రీల్స్ లో మారుమ్రోగిపోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. #double-ismart #steppamaar-song #hero-ram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి