Dost : తెలంగాణ(Telangana) లో అన్ని డిగ్రీ కాలేజీ(Degree Colleges) ల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ(DOST-2024) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత మండలి విడుదల చేసింది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, మహిళా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, అలాగే పాలిటెక్నిక్‌లో డీ-ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది కొత్తగా బీకాం ఫైనాన్స్, బీఎస్సీ బయో మెడికల్ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం మూడు విడుతల్లో అడ్మిషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ కోసం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై సంచలన స్టడీ.. ఏ సీటులో ఎవరు గెలుస్తారంటే?
1.మొదటి విడుత రిజిస్ట్రేషన్లు మే 6న ప్రారంభమవుతాయి. మే 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. జూన్ 3న సీట్ల కేటాయింపు, జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు సీట్లు వచ్చిన కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
2.రెండో విడుత రిజిస్ట్రేషన్ జూన్ 4 నుంచి 13వ తేదీ వరకు ఉంటుంది. జూన్ 4 నుంచి 14 వరకు వెబ్‌ఆప్షన్స్, జూన్ 18న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
3.మూడో విడత రిజిస్ట్రేషన్ జూన్ 19 నుంచి 25 వరకు ఉంటుంది. జూన్ 19 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్స్(Web Options), జూన్ 29న సీట్ల కేటాయింపు జరుగుతుంది. అదే రోజు నుంచి జులై 3 వరకు విద్యార్థులు సీట్లు వచ్చిన కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే మూడో విడుత రిజిస్ట్రేషన్లకు విద్యార్థులు రూ.400 చెల్లించాలి. ఇక జులై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
Also Read: అమిత్ షా వీడియో మార్పింగ్ కేసుపై హైకోర్టు స్టే..