Govt Scheme: ఆడపిల్లల భవిష్యత్ కోసం దిగులు చెందకండి...ఈ అద్భుతమైన స్కీంలో లక్ష పెడితే...44లక్షల ఆదాయం..ఎలాగో తెలుసా?

సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తాన్ని సంపాదించవచ్చు. రూ. 1లక్ష పెట్టుబడితో ఈ స్కీం ద్వారా రూ. 44లక్షల ఆదాయం మీ చేతిలోకి వస్తుంది. ఈ స్కీంలో ఏడాదికి 8శాతం వడ్డీ లభిస్తోంది. ఏడాదికి గరిష్టంగా రూ. 1.5లక్షలు డిపాజిట్ చేయవచ్చు.

Govt Scheme: ఆడపిల్లల భవిష్యత్ కోసం దిగులు చెందకండి...ఈ అద్భుతమైన స్కీంలో లక్ష పెడితే...44లక్షల ఆదాయం..ఎలాగో తెలుసా?
New Update

తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ కోసం తాపత్రాయపడుతుంటారు.వారి భవిష్యత్ బంగారంలా ఉండాలని కలలు కంటుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారి చదువు, పెళ్లి గురించి ముందు నుంచే డబ్బు పొదుపు చేస్తుంటారు. ఎందుకంటే ఈరెండు బాధ్యతలకు పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. అయితే ఇందుకు బెస్ట్ ఆఫ్షన్ గా తల్లిదండ్రులకు ఎంతో తోడ్పాటుగా ఉంటోంది సుకన్య సమృద్ది యోజన.ఈ పథకంలో చిన్న మొత్తంలో పెట్టుబడితే పెడితే ఎక్కువ మొత్తాన్ని సంపాదించవచ్చు. రూ. 1లక్ష పెట్టుబడితో ఈ పథకం ద్వారా రూ. 44లక్షల ఆదాయం మీ చేతికి అందుతుంది. ఎలాగంటే.

నిజానికి ఆడపిల్లల భవిష్యత్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీంలను అమలు చేస్తున్నాయి. అయితే బేటీ బచావ్, బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కేంద్రం 2015లో సుకన్య సమృద్ధి యోజన స్కీంను ప్రారంభించింది. ఈ స్కీం చాలా పాపులర్ అయ్యింది. పోస్టాఫీస్ నిర్వహించే ఈ స్కీం రిటర్న్స్, ట్యాక్స్ ఎగ్జమ్సన్ ఆఫర్ చేస్తుంది.

భారత ప్రభుత్వం ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. పేరెంట్స్ లేదా చట్టపరమైన సంరక్షకులు పదేళ్లలోపు ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరవవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ లో చేసే పెట్టుబడిపై ఏడాదికి 8శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఇందులో పేరెంట్స్ ఏడాదికి గరిష్టంగా రూ. 1.5 లక్షల డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీంలో పెట్టుబడి 15ఏళ్లపాటు చేయాలి. మీ బిడ్డకు 18ఏళ్లు నిండినప్పుడు పెళ్లి లేదా ఉన్న చదువుల కోసం అకౌంట్ నుంచి డబ్బును తీసుకోవచ్చు. లేదా మెచ్యూరిటీ వ్యవధిని 21ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు.

ఈ పథకంలో 15ఏళ్లపాటు ఏటా రూ. 1లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే 15సంవత్సరాల్లో పెట్టుబడి రూ. 15లక్షలు జమ అవుతుంది. 8శాతం వార్షిక వడ్డీ రేటుతో 15ఏళ్లలో మొత్తంగా రూ. 29, 89, 690 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత పెట్టుబడి పెట్టిన మొత్తం సంపాదించిన వడ్డీ కలిపి అందుకుంటారు. అంటే 15సంవత్సరాలకు ఏకంగా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ నుంచి రూ. 44, 89, 690 రూపాయలు లభిస్తుంది. మీ అమ్మాయికి 3ఏల్ల వయస్సు ఉండి...2024 నుంచి ఈ స్కీంలో పెట్టుబడి పెట్టినట్లయితే మొదటి 15ఏళ్లు అంటే 2029 వరకు ఏటా డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీ బిడ్డకు 21ఏళ్లు వచ్చినప్పుడు చదువు లేదా పెళ్లి కోసం డబ్బు తీసుకోవచ్చు. 21ఏళ్ల తర్వాత అంటే 2025లో సుకన్య సమృద్ధి యోజన అమౌంట్ మెచ్యూర్ అవుతుంది. అసలు, వడ్డీ కలిపి మీ చేతికి అందుతుంది.

ఇది కూడా చదవండి: విద్యార్థులకు అదిరిపోయే వార్త..ఈనెలలో వరుసగా ఐదురోజులు సెలువులు..ఎప్పటి నుంచో తెలుసా?

#govt-scheme #ssy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe