Helth Tips: ఎవరైనా అపస్మారక స్థితికి వెళ్తే ఈ తప్పు చేయకండి.. తప్పక తెలుసుకోండి

ఈ రోజుల్లో తీవ్రమైన వేడిగాలుల పట్టిపీడిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హీట్ స్ట్రోక్ కారణంగా.. తక్కువ రక్తపోటు, గుండెస్పందన రేటులో మార్పు, మూర్ఛ, తల తిరగడం వంటి సమస్యలు ఉండవచ్చు.

New Update
Helth Tips: ఎవరైనా అపస్మారక స్థితికి వెళ్తే ఈ తప్పు చేయకండి.. తప్పక తెలుసుకోండి

Helth Tips: వేడి, బలమైన సూర్యరశ్మికి గురికావడం వల్ల చాలామందిలో మూర్ఛ, మైకము వంటి సందర్భాలను చూసి ఉంటారు. తరచుగా అలాంటి వ్యక్తులు సరైన సమయానికి చికిత్స పొందరు. దీని కారణంగా వారి ఆరోగ్యం మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హీట్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. మీకు, ఎవరైనా వడదెబ్బ కారణంగా తలతిరగినట్లు అనిపిస్తే.. వారికి కొంత ప్రథమ చికిత్స అందించాలని.. తద్వారా లక్షణాలు తీవ్రతరం కాకుండా నిరోధించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయితే.. అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. దీని గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మూర్ఛ- మైకము అనిపిస్తే..

మీరు వేడి కారణంగా స్పృహ కోల్పోవడం, తల తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే.. ముందుగా డీహైడ్రేషన్ సమస్య నుంచి శరీరానికి నీటిని అందించాలి. వీలైతే.. మీ బట్టలు తీసివేసి.. వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లండి. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉండటం వల్ల మూర్ఛ, మైకము చాలా సందర్భాలలో సంభవిస్తాయి. ఆ టైంలో.. ఈ చర్యలు చాలా వరకు ఉపశమనం కలిగిస్తాయి.

అపస్మారక స్థితిలో నీరు ఇవ్వకూడదు:

  • అపస్మారక స్థితిలో ఆహారం, నీరు పొట్టకు బదులుగా ఊపిరితిత్తులకు చేరవచ్చు. ఇది శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
  • అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి గుండె స్పందన రేటు, రక్తపోటును తనిఖీ చేయాలి. అది చాలా ఎక్కువ, తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే.. అతన్ని వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.
  • తగిన మోతాదులో నీరు తాగాలి. నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తప్పకుండా తినాలి.
  • అధికంగా టీ, కాఫీ తాగడం మానుకోవాలి. ఇవి డీహైడ్రేషన్ ప్రమాదాన్ని కలిగిస్తాయి.
  • ORS తీసుకుంటూ ఉండాలి. ఇది శరీర ద్రవాలను త్వరగా నింపడంలో సహాయపడుతుంది.
  • వేసవిలో కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు ఎక్కువగా తాగాలి.
  • ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వీలైనంత వరకు సూర్యరశ్మికి గురికాకుండా చూసుకోవాలి.
  • కాటన్, వదులుగా ఉండే, తేలికపాటి బట్టలు ధరిస్తే ఆరోగ్యానికి ఇంక మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: డబ్బుల కోసం రాత్రంతా మేల్కొని ఉంటున్నారా..? అయితే జరిగేది ఇదే..!!

Advertisment
తాజా కథనాలు