Kavitha: తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దు.. కవిత విజ్ఞప్తి!

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి సీఎం అయ్యి రికార్డ్ సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ పాలనలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు.

Kavitha: కాంగ్రెస్ కావాలా? .. కరెంట్ కావాలా?.. కవిత కీలక వ్యాఖ్యలు!
New Update

Telangana Elections 2023: తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దని ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ తో కలిసి బండలింగాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో కవిత పాల్గొన్నారు. పదేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ ది అని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ కొట్టి సీఎం కేసీఆర్ రికార్డ్ సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలు గెలుస్తారు... బతుకులు బాగుంటాయని అన్నారు.

ALSO READ: ఆడపిల్ల పుడితే రూ.2 లక్షలు, విద్యార్థినులకు ఉచిత స్కూటీ..

తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల్లో చెరువులు నిండుకుండలా ఉన్నాయని అన్నారు. “చెరువు ఎండిపోయినప్పుడు చెరువును విడిచిపెట్టి కప్పలు వెళ్లిపోతాయి. కానీ చేపలు మాత్రం చెరువు నిండినా ఎండినా అక్కడే ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు చేపల్లాంటి వాళ్లు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కప్పల వంటి వాళ్లు” అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ కోసం బీజేపీ ఎప్పడూ మాట్లాడలేదని, సీఎం కేసీఆర్ దీక్ష చేసేంత వరకు ఒక్కరు మాట్లాడలేదని విమర్శించారు. వాళ్ల మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. చెరువులు ఎండిన నాడు ప్రజలతో బీఆర్ఎస్ ఉందని, ఇప్పుడు చెరువులు నిండిననాడు కూడా ప్రజలతోనే బీఆర్ఎస్ ఉందని వివరించారు. కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉంటేనే మనవాడు అవుతారని చెప్పారు. వచ్చేది సీఎం కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిచినా లాభం లేదని, బీజేపీ అభ్యర్థి గెలిచినా ఒంటి కొమ్ము సొంటికాయలా ఉంటారు కానీ అధికారంలోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీతో ఒక అణాపైసా లాభం జరిగిందా అని ప్రశ్నించారు.

కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ను టార్గెట్ చేస్తూ కవిత విమర్శలు చేశారు. వచ్చేది సీఎం కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిచినా లాభం లేదని, బీజేపీ అభ్యర్థి గెలిచినా ఒంటి కొమ్ము సొంటికాయలా ఉంటారు కానీ అధికారంలోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీతో ఒక అణాపైసా లాభం జరిగిందా అని ప్రశ్నించారు.

ALSO READ: నన్ను సీఎం అనకండి ప్లీజ్.. బండి సంజయ్ రిక్వెస్ట్!

10 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా తీర్చిదిద్దారని అన్నారు. ఒక్క చిన్న అవినీతికి తావు లేకుండా పనిచేస్తే అగ్రగామిగా రాష్ట్రం నిలిచిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పథకాల తీసుకొచ్చారని అన్నారు.

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ వంద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ చేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాల్లు మాటమీద నిలబడేవాళ్లు కాదని చెప్పారు. బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల బతుకులు బాగుంటాయని అన్నారు. సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో నిమ్స్ ఆస్పత్రిలో సంజయ్ వెంటే ఉండి తమకు ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. సంజయ్ తనకు సోదరుడు వంటివారని, సంజయ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

#congress-bjp-brs #telangana-election-2023 #telangana-election-updates #kavitha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe