Pneumonia: చలికాలంలో ఈ సమస్యలా..నిర్లక్ష్యం చేయకండి శీతాకాలంలో వచ్చే వ్యాధుల్లో న్యూమోనియా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. చలితో జ్వరం ఎక్కువైనప్పుడు దగ్గు, ఛాతిలో నొప్పి, కఫం, ఆయాసం, న్యూమోనియా రావడానికి ప్రధాన కారణాలు. న్యూమోనియా సమస్య పలు రకాల అంటువ్యాధుల ప్రేరకాల వలన వస్తుంది. By Vijaya Nimma 12 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Pneumonia: శీతాకాలం వచ్చిందటేనే ఇబ్బంది పెట్టే వ్యాధులు రడీగా ఉంటాయి. వాటిల్లో న్యూమోనియా (Pneumonia) ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. దీనిని ముందే అప్రమత్తంగా ఉంటే నష్టాన్ని నివారించుకోవచ్చు. ఇంతకీ న్యూమోనియా అంటే ఏమిటి..? దీని లక్షణాలేంటి..? ఈ వ్యాధి రావడానికి కారణాలేంటి.. ? దీని ద్వారా ఎవరికి ఎక్కువ ప్రమాదం..? అనే దానిపై ఇప్పుడు మనం తెలుసుకుందాం. న్యూమోనియా అంటే: ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. లంగ్స్‌లో అల్వియోలీ అనే చిన్న చిన్న గదులులు ఉంటాయి. మనం గాలి పీల్చుకొన్నప్పుడు ఈ గదులలో ఆక్సిజన్ వెళ్తుంది. అదే.. న్యూమోనియా వచ్చిన వ్యక్తికి ఆ గదులలో గాలి కాకుండా బ్యాక్టీరియల్ వైరస్‌తో ఉన్న ద్రవపదార్థం చేరుతుంది. అప్పుడు ఆ సమయంలో గాలి పీల్చుకోవడం తగ్గి, ఆక్సిజన్ మోతాదు తగ్గిపోతుంది. లక్షణాలు.. చలితో జ్వరం ఎక్కువైనప్పుడు దగ్గు, ఛాతిలో నొప్పి, కఫం, శ్వాస తీసుకోవడం కష్టం అవుతాయి. వీటితోపాటు ఆయాసం, నీరసం, ఆహారం తీసుకోకపోవడం, వాంతులు, వికారం, అలసట న్యూమోనియా రావడానికి ప్రధాన కారణాలు. న్యూమోనియా సమస్య పలు రకాల అంటువ్యాధుల ప్రేరకాల వలన వస్తుంది. అంటే.. ఇతర వ్యక్తుల ద్వారా, హాస్పిటల్ ద్వారా బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వల్ల ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ముఖ్యమైనవి.. స్ట్రెప్టోకోకస్ : న్యూమోనియా చిన్నపిల్లల్లో వచ్చే అత్యంత సాధారణమైన బాక్టీరియా ఇది. శ్వాసకోశ వ్యాధిగ్రస్థులు, బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులు ఎక్కువగా దీని బారిన పడతారు. వైరస్‌తో, ఫంగస్‌తో : వైరస్‌తోపాటు ఫంగస్‌తో కూడా కొన్ని రకాల న్యూమెనియా వ్యక్తి శరీరంలోకి వస్తుంది. మైకోప్లాస్మా : 40 ఏళ్ల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి, రద్దీగా ఉండే ప్రాంతాలలో ఉండే వారికి ఎక్కువగా సోకుతుంది. కానీ ఇది పెద్దగా ఎక్కవ ప్రభావం చూపదు. క్లేబ్సియెల్లా : ఇది మనిషుల నుంచి కాకుండా.. శరీరంలోని పేగులలో ఉండే ఓ రకమైన బాక్టీరియా వలన వస్తుంది. ఇది పేగులలో ఉన్న వరకూ ఇబ్బంది రాదు. పేగుల నుంచి ఇతర శరీర భాగాలకు వ్యాప్తి చెందితే మాత్రం చాలా ప్రమాదకారిగా ఉంటుంది. సూడోమోనాస్: ఈ న్యూమోనియా వ్యాధి ఎక్కవ కాలం ఆస్పత్రిల్లో ఉండడం వల్ల సోకే అవకాశం ఉంది. లెజియోనెల్లా : ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించదు. ఈ ప్రమాదకరమైనది వ్యాధి కలుషితమైన నీటికి వల్ల వస్తుంది. ఇది కూడా చదవండి: పిల్లలను ఫోన్ వాడటం మానిపించే చిట్కాలు మీ కోసం గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #pneumonia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి