Bigg Boss 7 Telugu: "నువ్వు నాతో పోల్చుకోకు".. వస్తావు.. తింటావు.. వెళ్లి కూర్చుంటావు.. అంతే..!

బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఇంటి సభ్యులంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో శోభ- యావర్, శివాజీ-శోభ, ప్రియాంక- యావర్ మధ్య వాదనలు జరిగాయి.

Bigg Boss 7 Telugu: "నువ్వు నాతో పోల్చుకోకు".. వస్తావు.. తింటావు.. వెళ్లి కూర్చుంటావు.. అంతే..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా అన్నట్లుగానే నిన్నటి ఎలిమినేషన్ ఎపిసోడ్ సాగింది. లీస్ట్ ఓట్స్ ఉన్న అర్జున్ ప్లేస్ లో గౌతమ్ ఎలిమినేట్ అవ్వడం పెద్ద ట్విస్ట్. ఫినాలే అస్త్రా గెలిచినందున అర్జున్ సేవ్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ షో మరో మూడు వారాలు మాత్రమే మిగిలింది. ఈ మూడు వారాల్లో గేమ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈరోజు తాజాగా విడుదలైన నామినేషన్ ప్రోమో కూడా అలానే ఉంది. ఈ ప్రోమోలో ఇంటి సభ్యులంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.

నామినేషన్ ప్రక్రియ

నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో.. "14 వారాలు గా ఒకరిని ఒకరు ఎదుర్కొని మీరంతా ఇక్కడికి చేరుకున్నారు. బిగ్ బిగ్ ఇంట్లో నుంచి ఎవరిని బయటకు పంపాలి అనేది నిర్ణయించుకొని.. వారి ఫొటోను టైల్ పైన ఉంచి దానిని పగలగొట్టి నామినేట్ చేయాలని" తెలిపారు బిగ్ బాస్.

publive-image

నువ్వు ఎవరైనా చెప్పిన మాటను బ్లైండ్ గా ఫాలో అవుతావు

ఈ నామినేషన్ ప్రక్రియలో ముందుగా యావర్.. శోభను నామినేట్ చేశాడు. నువ్వు ఎవరైనా చెప్పిన మాటను బ్లైండ్ గా ఫాలో అవుతావు.. నిజం తెలుసుకోవు అని యావర్ శోభను నామినేట్ చేశాడు. దానికి శోభ.. శెట్టి యువర్ గేమ్ ఈజ్ ఓవర్ అని చెప్పడం నాకు నచ్చలేదు అని వాదించింది. ఈ విషయంలో యావర్ కూడా వాదిస్తూ.. నేను అలా చెప్పలేదు.. నువ్వు వేరే వాళ్ళు చెప్పిన మాటను బ్లైండ్ గా ఫాలో అయ్యావు అని వాదించాడు.

publive-image

వస్తావు.. తింటావు.. వెళ్లి కూర్చుంటావు

ఆ తర్వాత ప్రియాంక, యావర్ ఇద్దరి మధ్య వాదన జరిగింది. యావర్ కిచెన్ లో పని చేయట్లేదని నామినేట్ చేసింది. దానికి యావర్ .. మరి శోభ ఏం చేస్తుంది అని ప్రశ్నించాడు. వెంటనే శోభ.. నువ్వు నాతో కంపేర్ చేసుకోవద్దు.. డిన్నర్ రెడీ అయిన తర్వాత వస్తావు.. తింటావు.. వెళ్లి కూర్చుంటావు.. అంతే ఏం చేస్తున్నావు అని వాదించింది.

publive-image

నేను అమర్ ను నామినేట్ చేయాలనుకోలేదు

శోభ.. శివాజీని నామినేట్ చేస్తూ.. "లాస్ట్ వీక్ టాస్క్ లో త్వరగా గివ్ అప్ ఇచ్చారని చెప్పింది. ఎందుకు ఇస్తానమ్మ.. తెలిసి కూడా.. రేసులో ఉండాలనే అనుకుంటాను కదా అని వాదించాడు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. మరి అమర్ ఫౌల్ గేమ్ ఆడాడు అని అందరు చెప్పారు.. తనను నామినేట్ చేయవా అని శోభను ప్రశ్నించాడు. ఇక శోభ నేను దాని కోసం చేయను.. చేయాలనుకోలేదని చెప్పింది.

publive-image

#bigg-boss-7 #bigg-boss-telugu #bigg-boss-promo
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe