ఆ మెడిసిన్ గురించి ఆహా.. ఓహా అన్నారు.. కరోనాకు విరుగుడు దొరికేసిందన్నారు. మిరెకిల్ మెడిసిన్ అంటూ బిరుదులు కూడా ఇచ్చారు. తీరా ఆ మందు నిజస్వరూపం తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరోనాకు మందు అని భావించి హైడ్రాక్సీ క్లోరోక్విన్-HydroxyChloroQuine(HCQ)ని వినియోగించిన పేషెంట్లు పిట్టల్లా రాలిపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. 6 దేశాల్లో ఏకంగా 17వేల మంది ఈ మాయదారి మందుకు బలైపోయారు. ఏ మందును ఏ చికిత్సలో వాడాలో తెలియని సాధారణ మనుషులో, డాక్టర్లో తప్పటి అడుగు వేస్తే ఏదో పొరపడ్డారులే అనుకోవచ్చు కానీ.. ప్రపంచానికి తానే పెద్దన్ననని.. తమ FDI(ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్)మాటే వేదమని.. బైబిల్ అని.. ఖురాన్ అని గొప్పలు పోయే అమెరికా చేసిన నిర్వాకం బయటపడింది.
17వేల మంది బలి:
హైడ్రాక్సీ క్లోరోక్విన్ (HCQ) గురించి కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారి సమయంలో వైద్యులు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ మందు వల్ల 17 వేల మరణాలు సంభవించాయని ఓ అధ్యయనం తెలిపింది. ఫ్రెంచ్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో HCQ వినియోగం వల్ల ఆరు దేశాలలో దాదాపు 17,000 మంది మరణించారని కనుగొన్నారు. అమెరికాలో అత్యధికంగా 12,739 మంది, స్పెయిన్‌లో 1,895 మంది, ఇటలీలో 1,822 మంది, బెల్జియంలో 240 మంది, ఫ్రాన్స్‌లో 199 మంది, టర్కీలో 95 మంది ఈ మెడిసన్ వాడి చనిపోయినట్టు అధ్యయనంలో తేలింది. అయితే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనం మార్చి 2020 నుంచి జూలై 2020 వరకు మాత్రమే జరిగింది. ఇందులో కేవలం ఆరు దేశాలను మాత్రమే చేర్చారు. మిగిలిన దేశాల లెక్కలపై కూడా అధ్యయనం చేసి ఉంటే ఈ సంఖ్య ఎంత ఉంటుందో ఊహించడం కష్టం.
ఎలా చనిపోయారు?
HCQ వినియోగం తర్వాత నమోదైన 17,000 మరణాలలో గుండె ఆగిపోవడం, కండరాల బలహీనత కారణంగా ఎక్కువ మంది చనిపోయినట్టు అధ్యయనం చెబుతోంది . అమెరికా, టర్కీ, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ దేశాల్లోని లెక్కలివి. కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన రోగులు, వాళ్లు ఏ మందులు తీసుకున్నారో పర్యవేక్షించిన అధ్యయన బృందం ఈ విషయాన్ని కనుగొంది. బయోమెడిసిన్ అండ్ ఫార్మకోథెరపీ సంచికలో ప్ఈ అధ్యయనం రచురితమైంది.
ట్రంప్ విజ్ఙప్తి.. FDA ఆమోదం:
రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ చికిత్సకు తరచుగా ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును తీసుకోవాలని 2020లో నాటి యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. తానే స్వయంగా 'మిరాకిల్ మెడిసిన్' తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. నిజానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది మలేరియా మందు. కరోనా ఫస్ట్ వేవ్ పీక్స్‌లో ఉన్న సమయంలో దీన్ని కోవిడ్ చికిత్సలో విస్తృతంగా ఉపయోగించారు. మార్చి 28, 2020న అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఈ మెడిసిన్‌ను కరోనా చికిత్సలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంతో సహా అనేక రీసెర్చ్‌లు ఈ HCQ మెడిసిన్‌ను కరోనా అత్యవసర చికిత్సలో వినయోగించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనావైరస్‌పై ఎలాంటి ప్రయోజనం చూపదని.. మరణ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయని కనుగొన్నాయి. దీంతో జూన్ 2020లో ఈ మెడిసిన్‌కు కరోనా చికిత్సలో ఇచ్చిన అత్యవసర వినియోగ అనుమతిని FDA రద్దు చేసింది. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోయిన ప్రాణం తిరిగిరాదు కదా!
భారత్‌లో కూడా ప్రాణాలు పోయాయా?
ఇటు ఇండియా సైతం HCQను కరోనా అత్యవసర చికిత్సలో వినియోగించింది. వివిధ దేశాలకు ఈ మందును కరోనా చికిత్స కోసం సప్లై చేసింది కూడా. 2020 జూన్‌లో స్వయంగా ఐసీఎంఆర్(ICMR) ఈ మందు వాడకం సేఫ్ అని చెప్పుకొచ్చింది. తర్వాత వివిధ అధ్యయనల తర్వాత 2021 సెప్టెంబర్‌లో HCQని కొవిడ్ ప్రొటోకాల్స్ నుంచి తొలగించింది. తాజాగా ఫ్రెంచ్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో భారత్ పేషెంట్లు లేరు.
Also Read: రోహిత్, కోహ్లీ టీ20 భవితవ్యం తేలేది నేడే.. బీసీసీఐ మీటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ!
WATCH: